Asaduddin Owaisi: ఏపీ ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువని స్పష్టం చేశారు. ముస్లింల అభివృద్ధిని అడ్డుకునేందుకు ఏపీలో బీజేపీ-ఆర్ఎస్ఎస్‌తో కలిసి తెలుగుదేశం-జనసేనలు పనిచేస్తున్నాయన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల వేళ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. ఏపీ ప్రజలు ఈసారి వైఎస్ జగన్‌కు అండగా నిలబడాలంటూ నేరుగా పిలుపునిచ్చారు. సాక్షి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలపై ఆయన స్పందించారు. చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య తేడాను ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఏపీలో బీజేపీ ఎజెండాను చంద్రబాబు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. నాడు 2004లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది మహానేత వైఎస్సార్ అని, ఆ రిజర్వేషన్లతో ఏపీ, తెలంగాణలో ముస్లింలు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారని గుర్తు చేశారు. ఇది చూసి ఓర్వలేని బీజేపీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. 4 శాతం రిజర్వేషన్లతో ముస్లింలు లబ్ది పొందడం బీజేపీకు మింగుడుుపడటం లేదన్నారు. 


సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీనే తన లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకు మొన్నటి వరకూ మాట్లాడిన జీ 20, చంద్రయాన్, 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థ మాటల్ని పక్కనబెట్టి, హిందూ-ముస్లిం చట్టాలు, ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. విద్యా, ఉద్యోగపరంగా ముస్లింల అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేకపోతోందన్నారు. 


ఏపీలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ముస్లిం, దళితులకు శత్రువులని ఒవైసీ స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీ ఎజెండా ఆధారంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఏపీలో కూటమి అధికారంలో వస్తే బీజేపీ-జనసేనతో కలిసి ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తారని అసదుదీన్ ఒవైసీ తెలిపారు. ఆ తరువాత దళితుల రిజర్వేషన్లపై పడతారన్నారు. అందుకే ఏపీ ప్రజలు ఆలోచించి చంద్రబాబు-జనసేన వంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీల్ని ఓడించాలని కోరారు. 


ఏపీ ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలబడలాని కోరారు. జగన్ మోహన్ రెడ్డి మతతత్వ వాది కాదని, పక్కా లౌకికవాదని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న సమస్యల కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అంతేకానీ దళితులు, ముస్లింల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీ పడలేదన్నారు. చంద్రబాబు మాత్రం ముస్లింల ప్రయోజనాలు తాకట్టు పెట్టి స్వలాభం కోసం ఆలోచించారని విమర్శించారు. 


Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook