Bus Accident: విజయవాడ ఆర్టీసీ బస్టాండులో ప్లాట్‌ఫామ్‌పై బస్సు దూసుకొచ్చేసిన ఘటనలో 12వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్రమాదంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయవాడ ఆర్టీసీ బస్టాండు ప్రమాదం కలకలం రేపింది. ప్లాట్‌ఫామ్ నెంబర్ 12పై ఆగి ఉన్న బస్సు వెనక్కి తీసే క్రమంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా రైలింగ్ దాటి ప్లాట్‌ఫామ్‌పై ముందుకు వచ్చేయడంతో అక్కడ ఉన్న కండక్టర్, మహిళా ప్రయాణీకురాలు, రెండున్నరేళ్ల బాబు మరణించారు. బస్సు ఒక్కసారిగా ప్రయాణీకులపై దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. రివర్స్ గేర్ వేసినప్పుుడు బస్సు వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్లడం వల్ల ప్రమాదం జరిగినట్టు కొందరు చెబుతుంటే..రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడం వల్ల ప్రమాదం జరిగిందని మరి కొందరు చెబుతున్నారు. ఇది విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన మెట్రో లగ్జరీ సర్వీసు బస్సు. అదృష్టవశాత్తూ ప్లాట్‌ఫామ్‌పై పెద్దగా ప్రయాణీకులు లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. లేకుంటే మరింతమంది చనిపోయేవారు. 


ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మరణించిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై ఏపీఎస్సార్టీసీ ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా ప్రాధమికంగా నిర్ధారించారు. విచారణ చేస్తున్నామని, 24 గంటల్లో నివేదిక వస్తుందని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు తెలిపారు. సాంకేతిక లోపముందా లేక మానవ తప్పిదమా అనేది పరిశీలిస్తున్నామన్నారు. 


Also read: Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook