Supreme Court: ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం, మే 9నే విచారణ
Supreme Court: ఏపీ మూడు రాజాధానుల అంశం త్వరలో కొలిక్కి రానుంది. సుప్రీంకోర్టు విచారణ ఒక్కసారిగా ముందుకు జరిగింది. ఆకస్మాత్తుగా ఈ నెల 9వ తేదీకు లిస్ట్ అవుట్ చేసింది సుప్రీంకోర్టు.
Supreme Court: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. వాస్తవానికి ఈ కేసుపై విచారణను సుప్రీంకోర్టు గతంలో జూలై 11వ తేదీకు వాయిదా వేసింది. కానీ కారణమేంటో తెలియదు గానీ, ఒక్కసారిగా విచారణ తేదీ ముందుకు జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ రాజధాని అంశంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూలై 11న జరగాల్సి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు ఒక్కసారిగా ప్రీ లిస్ట్ చేసింది. జులై 11 నుంచి మే 9కు విచారణ తేదీని ప్రీ పోన్ చేసింది. ఈ పరిణామం ఊహించనిది కావడంతో అంతటా చర్చనీయాంశమౌతోంది.
అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై గతంలో విచారణ చేసిన సుప్రీంకోర్టు..ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. ఏపీకు రాజధాని మార్చే హక్కు లేదంటూ హైకోర్టు చెప్పడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. హైకోర్టు ఆదేశాల్ని రద్దు చేయాలని సుప్రీంను కోరింది. ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది. గతంలోనే సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణను జూలై 11కు వాయిదా వేయగా, ఇప్పుడీ అంశం ముందుకు జరిగి మే 9వ తేదీన విచారణకు రానుంది. జస్టిస్ జోసెఫ్ నేృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
ఏపీ రాజధానుల అంశంపై తదుపరి విచారణ వేగవంతం చేయాలని చాలాసార్లు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. వేసవి సెలవుల అనంతరం చేపడతామని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే వీలైనంత త్వరగా ఈ అంశంపై విచారణ జరిగేలా చూడాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలు చేసినవారిలో కొంతమంది మరణించారని..వారి స్థానంలో మరొకరికి స్థానం కల్పించాలని అక్కడి రైతులు అభ్యర్ధించారు. మరణించినవారి తరపున చట్ట బద్ధవారసుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని గత విచారణలోనే ప్రతివాదుల తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. అయితే ఈ విషయం తమకు తెలియదని ప్రతివాదుల చట్టబద్ధ వారసుల్ని గుర్తించి పిటీషన్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
ఏపీ ప్రభుత్వం కోరినట్టే మూడు రాజధానుల అంశంపై విచారణ ఏకంగా నెలరోజులు ముందుకొచ్చేసింది. జూలై 11న జరగాల్సిన సుప్రీంకోర్టు విచారణ కాస్తా మరో నాలుగు రోజుల్లో అంటే మే 9 జరగనుంది. ఇప్పటికీ మూడు రాజధానుల అంశంపైనే కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం కోర్టులో ఈ అంశం తేలిన తరువాతే ముందడుగు వేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం సెప్టెంబర్ నుంచి విశాఖకు మకాం మారుస్తున్నట్టు ప్రకటించారు.
Also read: YSR Kalyanamastu Scheme: నేడే లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook