Pushpa2 movie: పుష్పా2 షో సందర్భంగా మరో షాకింగ్ ఘటన.. మూవీ చూస్తు వ్యక్తి మృతి.. ఎక్కడంటే..?
Pushpa 2 movie controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం రోజు ఏదో అంశంతో వివాదాలలో ఉంటుంది. తాజాగా, ఒక వ్యక్తి ఈ మూవీ చూస్తు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Pushpa2 movie controversy: పుష్ప2 మూవీ డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే.అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 800 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం వెయ్యికోట్ల వసూళ్ల వైపుకు దూసుకుని పోతుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ మూవీ ఒకవైపు రికార్డుల పరంగా వార్తలలో ఉంటునే మరోవైపు వివాదాల్లో కూడా టాప్ లో దూసుకెళ్తుందని చెప్పుకొవచ్చు.
ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో.. హైదరబాద్ లోని సంధ్య థియేటర్ లో ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో దీనిపై పుష్పా టీమ్ సారీ చెప్పి.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పింది. అదే విధంగా ఈ మూవీ రిలీజ్ వేళ.. కర్ణిసేన.. షేకావత్ అనేపేరును తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ మూవీ రిలీజ్ అయిన పలు థియేటర్ లలో.. కొంత మంది మహిళలు గంగమ్మ తల్లి జాతర సీన్ ను చూసి.. పూనకంలో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్పా2 సినిమాకు సంబంధించి ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటుంది. తాజాగా, ఈ మూవీ చూస్తు.. ఒక వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తొంది.
పూర్తి వివరాలు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర కొనసాగుతుందని చెప్పుకొవచ్చు. ఈ మూవీని చూసేందుకు ఆడియన్స్ థియేటర్ లకు పొటెత్తుతున్నారని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తొంది. అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుడు మద్దానప్ప (37)గా పోలీసులు గుర్తించారు. పుష్పా2 సినిమాను చూస్తు చనిపోయినట్లు తెలుస్తొంది. కానీ చనిపోయిన వ్యక్తి బంధువులు మాత్రం.. తోపులాట వల్ల తమ వాడు చనిపోయాడని కూడా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ ఘటన కూడా ప్రస్తుతం వివాదస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.