Vishakapatnam: అనుమానంతో భార్యను డంబెల్‌తో కొట్టి చంపిన భర్త-ఆపై సూసైడ్..
Man kills wife and commits suicide in Vishakaptnam: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమె తలపై డంబెల్‌తో కొట్టి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని కుంచుమాంబ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Man kills wife and commits suicide in Vishakaptnam: విశాఖపట్నంలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడో భర్త. ఆపై అతను ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. తాను ఎందుకిలా చేశానో వివరిస్తూ ఆత్మహత్యకు ముందు సోదరుడికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. మృతుడి సోదరుడు, అతని భార్య అక్కడికి చేరుకునేసరికి.. ఇంట్లో ఇద్దరు విగతజీవులై కనిపించారు. విశాఖపట్నంలోని శ్రీహరిపురం పరిధిలో ఉన్న కుంచుమాంబ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... కాకినాడకు (Kakinada) చెందిన శివనాగేశ్వరరావు (34), మాధవి (28)లకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. మాధవికి శివనాగేశ్వరరావు మేనమామ అవుతాడు. పెళ్లి తర్వాత దంపతులు విశాఖపట్నంలోని కుంచుమాంబ కాలనీలో ఉంటున్నారు. శివనాగేశ్వరరావు స్థానికంగా వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయి మూడేళ్లయినా వీరికి పిల్లలు కలగలేదు. ఇదే క్రమంలో శివనాగేశ్వరరావుకు భార్య మాధవిపై అనుమానం మొదలైంది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
బుధవారం (డిసెంబర్ 15) అర్ధరాత్రి సమయంలో దంపతులు మరోసారి గొడవపడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన శివనాగేశ్వరరావు భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వ్యాయామం చేసే డంబెల్‌తో ఆమె తలపై బలంగా (Man kills wife) కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత శివనాగేశ్వరరావు అదే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు సోదరుడు కనకారావుకు వాట్సాప్ మెసేజ్ చేశాడు. మాధవి కొంతమందితో చనువుగా మెలుగుతోందని... వద్దని వారించినా ఆమె తన మాట వినట్లేదని పేర్కొన్నాడు. సోదరుడి మెసేజ్‌తో కనకారావు, అతని భార్య హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా... అప్పటికే శివనాగేశ్వరరావు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అదే గదిలో మాధవి రక్తపు మడుగులో విగతజీవిలా పడి ఉంది. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై (Vishakapatnam) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Fire accident in Japan: జపాన్ ఒసాకాలో భారీ అగ్నిప్రమాదం-27 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook