Manchu Vishnu : సీఎం వైఎస్ జగన్‌తో మంచు విష్ణు భేటీ, ఆలీకి గుడ్ న్యూస్ అట!
Manchu Vishnu CM Jagan Meet: సీఎం జగన్‌తో తాను పలు వ్యక్తిగత విషయాలపై మాట్లాడేందుకు భేటీ అయ్యానని.. జగన్ అన్నతో కలిసి భోజనం చేశానని.. పలు అంశాలపై ఆయనకు అపారమైన జ్ఞానం ఉందంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
Manchu Vishnu : ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో "మా" అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యంత్రి జగన్‌ను మంచు విష్ణు కలిశారు. సీఎం జగన్‌తో కలిసి మంచు విష్ణు లంచ్ చేశారు. కాగా తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర విష్ణు వాహనాన్ని నేరుగా లోపలకు సిబ్బంది పంపించారు. అయితే ఇటీవల సీఎంను కలిసేందుకు వెళ్లినటువంటి సినీ ప్రముఖుల వాహనాలన్నింటినీ గేట్ దగ్గరే ఆపేశారు. గేటు వద్ద నుంచి వారంతా నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
ఇక సీఎం జగన్‌తో తాను మర్యాదపూర్వకంగా కలినట్లుగా విష్ణు వెల్లడించారు. వ్యక్తిగత విషయాల గురించే తాను సీఎం జగన్‌తో తాను చర్చించానన్నారు. తాజాగా సీఎంతో జరిగిన సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి తన తండ్రి మోహన్‌బాబుకు ఆహ్వానం అందిందని.. కానీ దాన్ని కొందరు దాన్ని ఆయన వరకు చేరకుండా చేశారని విష్ణు పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో తమలో విభేదాలు ఉన్నప్పటికీ.. సినిమా వాళ్లమంతా ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. తమ మధ్య వచ్చిన విభేదాల్ని పరిష్కరించుకుంటామన్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి, మహేశ్, ప్రభాస్ తదితరులు సీఎంను కలిసిన విషయం తెలిసిందే.
సీఎం జగన్‌తో నటుడు ఆలీ కూడా సమావేశం అయ్యారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సీఎంను కలిశానని... త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందంటూ తనకు సీఎం చెప్పారని ఆలీ పేర్కొన్నారు. తాను ఏం ఆశించకుండా పార్టీలో చేరి, పార్టీకి తన చేతనైనంతా సాయం చేశానని ఆలీ చెప్పుకొచ్చారు.
త్వరలోనే తన పదవికి సంబంధించి వైఎస్సార్సీపీ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వస్తుందని ఆలీ పేర్కొన్నారు. అయితే నటుడు ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై పలు వార్తలు వచ్చాయి. ఆలీకి రాజ్యసభ సీటు దాదాపుగా కన్ఫమ్ అయ్యిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చర్చ సాగుతోంది.
Also Read: AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి
Also Read: Mammikka: 60 ఏళ్ల వయసులో మోడల్‌గా రోజువారి కూలి- అదృష్టం అంటే అతడిదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి