Mammikka: 60 ఏళ్ల వయసులో మోడల్​గా రోజువారి కూలి- అదృష్టం అంటే అతడిదే!

Mammikka: లాటరీ తగిలితే రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు కానీ.. ఫేమస్​ కావడం చాలా కష్టం. అయితే కేరళలో ఓ 60 ఏళ్ల కూలికి.. ఓ ఫొటోగ్రాఫర్​ వల్ల దశ తిరిగింది.. ఫేమస్ అయిపోయాడు. ఆ కథేమిటో చదివేయండి మరి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 06:14 PM IST
  • రాత్రికి రాత్రే మోడల్​ అయిపోయిన కేరళ కూలి
  • ఓ ఫొటో గ్రాఫర్ సహాయతో మారిన ఫేట్​
  • 60 ఏళ్ల వయసులో మోడల్​గా కొత్త జీవితం!
Mammikka: 60 ఏళ్ల వయసులో మోడల్​గా రోజువారి కూలి- అదృష్టం అంటే అతడిదే!

Mammikka: ఇంటర్నెట్​ యుగంలో ఫేమస్ అవ్వడం అనేది చాలా ఈజీ.. అదే సమయంలో చాలా కష్టం కూడా. కొందరేమో తమ పని తాము చేసుకుంటూ పోతుంటే.. అదృష్టం కలిసొచ్చి ఫేమస్​ అవుతారు. కొంతరేమో ఫేమ్​ వచ్చేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తారు.. అయినా అనుకున్నది దక్కుతుంది అని చెప్పలేం.

ఇప్పుడు ఈ టాపిక్​ ఎందుకొచ్చిందంటే.. కేరళలో కూలీ పనులు చేసుకునే వ్యక్తికి అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే సూపర్​ మోడల్​గా మారిపోయాడు.

ఫొటో గ్రాఫర్ రూపంలో అదృష్టం..

మమ్మికా అనే ఓ 60 ఏళ్ల వృద్ధుడు కూలీ పనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తుంటాడు. తన పని తాను చేసుకుంటూ ఎప్పటి లానే రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుడగా.. ఓ ఫొటో గ్రాఫర్ ఎదురయ్యాడు. ఆ వృద్ధిడిడిని ఆపి.. మీమల్ని మోడల్​ను చేస్తానన. తనతో రమ్మని అడిగాడు. అసలు మోడల్ అంటే ఏమిటో తెలియని ఆ వృద్ధుడికి ఏం అర్థం కాలేదు.

మొత్తానికి కొద్ది సేపు ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత సరే అని అతనితో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు

తలకు పాగా.. లుంగీ, పాత చొక్కా ధరించిన ఆ వృద్ధిడిని.. తన వెంబడి తీసుకెళ్లాడు ఆ ఫొటోగ్రాఫర్​.

పార్లర్​కు తీసుకెళ్లి.. హేర్​ కటింగ్​, గడ్డాన్ని అందగా ట్రిమ్​ చేయించాడు. ఆ తర్వాత ఫేషియల్ కూడా చేశారు. ఇక ఆ వృద్ధిడి సైజుకు సరిపడా షూట్​, ప్యాంట్, షూ వేయింటారు.

చెప్పినట్లుగానే వివిధ లోకేషన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. వాటన్నింటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. పాత ఫొటోను.. కొత్త ఫొటోను కలిపి చూస్తే.. అసలు ఆ వ్యక్తే ఇలా మారాడా? అంటే నమ్మలేనంగా మార్పు కనిపించింది.

దీనితో ఆ వ్యక్తి ఇప్పుడు కేరళలోనే కాకుండా దేశమంతా ఫేమస్ అయిపోయాడు. మమ్మికా కనిపిస్తే.. చాలు సెల్ఫీకోసం వచ్చేస్తున్నారు జనాలు.

దీనంతటికీ Shareek Vayalil Shk అనే ఫొటోగ్రాఫర్ కారణం. రోడ్డుపై ఆ వ్యక్తిని చూడగానే.. ఆ వ్యక్తిని మోడల్​ చూడాలని అనిపించకుంటే అసలు ఇది

సాధ్యమయ్యేదే కాదు. అదృష్టం మమ్మికాదే. ఎందుకంటే.. 60 ఏళ్ల వయసులో ఇలా తనకు ఏ మాత్రం తెలియని మోడలింగ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Also read: Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రెండోసారి కరోనా

Aslo read: Sansad TV: 'సంసద్​ టీవీ' యూట్యూబ్ ఛానెల్​ హ్యాక్​... అకౌంట్ నిలిపివేత ​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News