Manda Krishna Madiga: పోలీస్‌ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తూ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా మాదిగ హక్కుల పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) అధినేత మంద కృష్ణ మాదిగ రంగంలోకి దిగారు. అనితపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మాదిగ మహిళపై పవన్‌ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు పోలీస్‌ శాఖ బిగ్‌ షాక్‌.. పల్నాడు పర్యటనలో భద్రతా వైఫల్యం


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాంతిభద్రతల్లో పోలీస్‌ శాఖ విఫలమైందని.. అవసరమైతే తానే హోం శాఖను తీసుకుంటానని చెప్పి హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబును కలిసేందుకు మంగళవారం అమరావతి వచ్చిన మంద కృష్ణ ఈ సందర్భంగా పవన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. 'ఏమైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావలి. అంతేకానీ బహిరంగంగా మాట్లాడకూడదు' అని హితవు పలికారు.

Also Read: Pawan Kalyan: నేను హోంమంత్రి అయితే మరో 'యోగి'ని అవుతా! పవన్‌ కల్యాణ్‌ సంచలనం


 


ఎన్నికలకు ముందే జనసేన పార్టీనీ తప్పు పట్టానని.. ఇప్పుడు అదే వైఖరి అవలంభిస్తోందని మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎన్నికలకు ముందే పవన్‌ కల్యాణ్‌ను తాను వ్యతిరేకించినట్లు గుర్తుచేశారు. సామాజిక న్యాయం అని చెప్పిన పవన్ కల్యాణ్ మాదిగలకు ఎలా న్యాయం చేశారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కాపులకే పెద్దన్న.. కానీ మాకు (మాదిగలకు) కాదు అని స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళను దారుణంగా అవమానించినట్లేనని తెలిపారు. శాంతి భద్రతలు విఫలమైతే సీఎం చంద్రబాబును అన్నట్లే కదా? అని సందేహం వ్యక్తం చేశారు.


పవన్ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికే నష్టమని మంద కృష్ణ మాదిగ తెలిపారు. పవన్ తన శాఖను సరిగా నిర్వహించడం లేదని మరో మంత్రి అంటే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. జనసేన అంటే కమ్మ, కాపు ఓట్లతో మాత్రమే గెలవలేదని.. తమ మాదిగల ఓట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి ఇవ్వనప్పుడు ఇదేం సామాజిక న్యాయమని నిలదీశారు. మాట్లాడే సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతామని పేర్కొన్నారు. మంత్రివర్గం అంటే కుటుంబలాంటిది అని పవన్‌కు హితవు పలికారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వంగలపూడి అనితపై పవన్‌ అలా మాట్లాడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.