ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో జనసేన తరఫున బీఎస్పీ చీఫ్ మాయవతి ప్రచారం నిర్వహించనున్నారు. ఇరు పార్టీల మధ్య కుదిరిన పొత్తు కారణంగా ఆమె పవన్ పార్టీ తరఫున ప్రచారానికి అంగీకరించారు. మాయవతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ షెడ్యూల్ రెడీ చేసుకుంది. జనసేన పార్టీ కార్యాలయం నుంచి అందిన  సమాచారం ప్రకారం బీఎస్పీ అధినేత్రి మాయవతి ఈనెల 2న రాష్ట్రానికి రానున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాయ షెడ్యూల్ ఇదే...


రెండు రోజుల పాటు పర్యటనలో ఆమె పవన్ కల్యాణ్ తో కలిసి  అనేక సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. 


మాయావతి తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఏప్రిల్ 4న తిరుపతిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం పవన్ కల్యాణ్ తో కలిసి హైదరాబాద్ చేరుకుని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 


పవన్ వ్యూహం ఫలించేనా ?


ఎన్నికల్లో దళిత వర్గాలను ఆకర్షించేందుకు జనసేనానీ  పవన్ కల్యాణ్..బీఎస్పీ చీఫ్ మాయవతిని రంగంలోకి దించుతున్నారు. మరి మాయవతి ప్రచారంతో దళితవర్గాల ఓట్లు పవన్ ఏ మేరకు సాధిస్తారనది తేలాల్సి ఉంది.