Cryogenic Tankers: కరోనా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోడానికి ఏపీ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమౌతోంది. సింగపూర్ నుంచి ఏపీకు మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు చేరుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ రాష్ట్ర అవసరాల కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ (Megha Engineering )మూడు క్రయోజనిక్ ట్యాంకుల్ని ప్రభుత్వానికి ఉచితంగా అందించింది. 1.40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్ధ్యమున్న ట్యాంకర్లను సింగపూర్ నుంచి రప్పించింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. సింగపూర్ నుంచి ఇండియాకు చేరుకున్న వెంటనే..దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు. అక్కడ ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను ట్యాంకర్లలో నింపిన తరువాత ఏపీకు చేరుకుంటాయి. ఇప్పటికే 11 క్రయోజనిక్ ట్యాంకర్లను (Cryogenic Tankers) తెలంగాణ ప్రభుత్వానికి మేఘా సంస్థ ఉచితంగా అందించింది. ఏపీకు చేరుకున్న 3 ట్యాంకర్ల ద్వారా 4.20 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. ఈ తరుణంలో సింగపూర్ నుండి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap government) కోసం మేఘా ఇంజనీరింగ్  దిగుమతి చేసుకుంది.


Also read: Covid Vaccination: వ్యాక్సినేషన్‌లో ఏపీ అరుదైన ఘనత, కోటిమందికి వ్యాక్సిన్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook