Michaung Cyclone: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తూ ఇవాళ సాయంత్రానికి తుపానుగా మారనుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిచౌంగ్ తుపాను ఏపీవైపుకు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుంగండం కాస్తా సాయంత్రానికి తుపానుగా బలపడి..దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారాక, డిసెంబర్ 5వ తేదీ మద్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిచౌంగ్ తుపాను ప్రభావం ఊహించినదానికంటే ఎక్కువే ఉండవచ్చని అంచనా ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు జారీ అయ్యాయి.


మిచౌంగ్ తుపాను డిసెంబర్ 5 మద్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. సోమ, మంగళవారాల్లో అయితే అతి భారీ వర్షాలు ముంచెత్తవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడవచ్చు. దీనికితోడు తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.


ఇవాళ అంటే డిసెంబర్ 3వ తేదీన ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు.


ఇక డిసెంబర్ 4 సోమవారం నాడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల , పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక డిసెంబర్ 5 మంగళవారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం,  కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి.


Also read: Cyclone Michaung Updates: దూసుకొస్తున్న మిచాంగ్ తుఫాన్‌.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook