Michaung Cyclone Landfall: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను విధ్వంసం రేపుతోంది. కోస్తాతీరంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమౌతోంది. మరి కాస్సేపట్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాల్చి అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా బాపట్ల వద్ద తీరం తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు రెండు గంటల సమయం పట్టనుంది. ఈ రెండు గంటల సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం తాకడంతో తీరం వెంబడి గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రంలో భారీగా కెరటాలు ఎగసిపడుతూ సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. తీరం వెంబడి వీస్తున్న భారీ గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరుగుతున్నాయి, గాలుల తీవ్రత ముప్పుని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా ఇప్పటికే నిలిపివేశారు. బాపట్ల, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల గాలులు సుడులు తిరుగుతూ భయపెడుతోంది. 


తుపాను ప్రభావంతో కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తీరం వెంబడి జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంది. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మిచౌంగ్ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పంట నాశనమైంది. కోతకు సిద్దమైన పంట నాశనం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. 


గాలుల తీవ్రత సముద్రతీరం వెంబడి అంటే కాకినాడ నుంచి నెల్లూరు వరకూ తీవ్రంగా కన్పిస్తోంది. భారీ వర్షాల కారణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలుల తీవ్రతతో హోర్డింగులు పడిపోతున్నాయి. బాపట్ల వద్ద మద్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తీరం తాకినట్టు తెలుస్తోంది. మరో రెండు గంటల్లో తీరం పూర్తిగా దాటిన తరువాత తుపాను కాస్తా వాయుగుండంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.


Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు


Also Read: Vivo T2 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌..Vivo T2 Pro 5Gపై రూ.22,550 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి