Ambati Rambabu Challenges To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయితో విమర్శలు గుప్పించారు. జనసేనాని తనపై గుప్పించిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. శవాల మీద చిల్లర రాజకీయాలేంటి పవన్ కళ్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు. రైతుల ఆత్మహత్యల పరిహారంలో తాను లంచాలు తీసుకుంటున్నానని నిరూపించమని తాను సవాల్ విసిరితే.. నిరూపించకుండా పారిపోయాడని అన్నారు. తాను ఇప్పటికీ సవాల్ విసురుతున్నానని.. పవన్ ఆరోపించినట్లుగా తాను రైతుల ఆత్మహత్యల పరిహారంలో ఒక్క పైసా అయినా అవినీతికి పాల్పడ్డానని, లంచం అడిగానని నిరూపిస్తే.. తన పదవులను తృణప్రాయంగా వదిలేయడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాకాకుండా సంబంధం లేని  తప్పుడు ఆరోపణలతో తనపై నిందలు వేసి.. శవాల మీద చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదని జనసేన పార్టీ నాయకులను హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైసీపీ అధికారంలోకి వచ్చాక సత్తెనపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి కుటుంబాలకు పరిహారంగా ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం 84 లక్షలు పరిహారంగా ప్రభుత్వం అందించిందని మంత్రి అన్నారు. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అంబటి రాంబాబు అని తనపై తీవ్ర ఆరోపణలు చేశాడని.. రైతుల ఆత్మహత్యల విషయంలో బాధిత కుటుంబాల వద్ద నుంచి తాను ఒక్క పైసా అయినా  తీసుకున్నానని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ సవాల్‌కు ఇంతవరకూ సమాధానం చెప్పే ధైర్యం పవన్ కళ్యాన్‌కు లేదన్నారు. తాను విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


"నేను కక్కుర్తి పడితే రాజీనామా చేసి అవతలపడేస్తా. నేను శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తిని కాదు. ప్రజల డబ్బులను కాజేయాలనే దుర్బుద్ధి నాకు లేదు. నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నా. గతంలో ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబుకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్‌లా పార్టీని పెట్టి.. దానిని చంద్రబాబు పాదాల వద్ద పెట్టి ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయం నేను చేయను. ఒకే పార్టీని, ఒకే కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాను. 


మరణించిన రైతు కుటుంబాల నుంచి 2 లక్షలు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితిగానీ, ఖర్మగానీ నాకు పడితే.. నా పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను తప్పితే అవినీతికి పాల్పడను.." అని అంబటి రాంబాబు స్పష్టంచేశారు. సత్యం పలికే గడ్డ సత్తెనపల్లి.. ఇక్కడకు వచ్చి దుర్మార్గమైన మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్‌కు పుట్టగతులు ఉండవన్నారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. డీఏ పెంపుతోపాటు మరో గుడ్‌న్యూస్  


Also Read: Jammu And Kashmir Encounter: ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. భారీ ఎన్‌కౌంటర్‌లో హతం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook