Minister Ambati Rambabu Tweet: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. బ్రో సినిమా కలెక్షన్లు, పవన్ రెమ్యూనరేషన్ లెక్కలపై ఆయన కామెంట్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై వెబ్‌ సిరీస్‌లు తీస్తామంటూ వైసీపీ నేతలు ముందుకు వచ్చారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చర్చ  ఆపాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అంటున్నారని.. తన పిల్లలనే కాదు మిగతా ఇద్దరు పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి విన్నవించారు రేణూ దేశాయ్. వాళ్లు ఇంకా చిన్న పిల్లలు అని.. ఓ తల్లిగా తాను అభ్యర్థిస్తున్నానని అన్నారు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోవాలని సూచించారు. ఇటీవల రిలీజ్ అయిన ఓ చిత్రంలో సన్నివేశాలు వివాదానికి దారి తీసినట్లు తనకు తెలిసిందని.. ఆ వివాదం గురించి తనకు  అవగాహన లేదని చెప్పారు. అయితే శ్యాంబాబు క్యారెక్టర్ వివాదం కావడంపై రేణూ దేశాయ్ కామెంట్స్ చేశారు. 


రేణూ దేశాయ్ వీడియోపై మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింట్ ట్వీట్ చేశారు. "అమ్మా రేణూ..! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని..!" అని అంటూ కామెంట్స్ చేశారు. అయితే మంత్రి ట్వీట్‌కు పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్, జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు. సినిమాల రెమ్యూనరేషన్లు, కలెక్షన్లు పక్కనపెట్టి.. మంత్రిగా పోలవరం సంగతి చూడాలంటూ సలహాలు ఇస్తున్నారు. 


మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ మూవీకి టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై వివాదం చెలరేగుతోంది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. భోళా శంకర్ నిర్మాణ సంస్థ పూర్తి డాక్యూమెంట్లను అందివ్వలేదని తెలిపింది. తాము అడిగిన పత్రాలను అందివ్వనందుకు పర్మిషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. 


Also Read: Bhola Shankar Ticket Price: భోళా శంకర్‌ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఎందుకు రాలేదు..? అసలు కారణాలు ఇవే..!  


Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి