Nara Lokesh fires on ex cm ys jagan: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీతో పట్టం కట్టారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు, మంత్రులు ఇటీవల అసెంబ్లీలో కూడా ప్రమాణం చేశారు. వీరితో.. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ప్రమాణం చేయించారు. సీఎం  చంద్రబాబు గతంలో.. అసెంబ్లీలో జరిగిన తీవ్ర అవమానకర ఘటనలు గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీని తిరిగి గౌరవ సభగా మారిన తర్వాతే కాలు పెడతానంటూ ప్రతీన బూనారు. ఆయన అన్న విధంగానే తన శపథం పూర్తి చేసుకుని అసెంబ్లీలో సీఎంగా కాలుపెట్టారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనలో తనదైన మార్కును మరోసారి చూపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..


గత ప్రభుత్వంలో.. అధికార దుర్వినియోగాలకు పాల్పడిన పలువురు.. ఐఏఎస్, ఐపీఎస్ లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మరోవైపు ప్రజలకు మేలుచేసేదిశగా పాలన అందిస్తామంటూ చంద్రబాబు చెప్తున్నారు.ఈ క్రమంలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన అనేక  అక్రమాలపై ప్రత్యేకంగా, విచారణ ప్రారంభించారు. మాజీ సీఎం తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఏపీలో అనేక చోట్ల, వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలకు, ఇష్టమున్నట్లు భూములను కేటాయించినట్లు విషయం తెరపైకి వచ్చింది.


ఇటీవల తాడేపల్లిలో వైసీపీ.. అక్రమంగా నిర్మించిన పార్టీ ఆఫీసును అధికారులు కూలగొట్టారు. ఈ నేపథ్యంలో విశాఖలో వైఎస్సార్సీపీ భవనం అనుమతుల విషయంలో.. అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఏపీలో వైఎస్సార్సీపీ కోసం 26 జిల్లాపరిధిలో 42 ఎకరాలకు, కేవలం రూ. వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నారు. ఈ విషయంపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 


ఆంధ్ర ప్రేదేశ్ లోని ప్రతి జిల్లాలో భూముల ఆక్రమణలకు పాల్పడి పార్టీ ఆఫీసుల పెద్ద పెద్ద ప్యాలెస్ లు నిర్మిస్తున్నారని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  విమర్శించారు. ఏపీ మాజీ సీఎంపై నిప్పులు చెరుగుతూ.. ‘‘జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా!’’ అని జగన్‌పై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా భూములను, రూ. వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకొవడాన్ని తీవ్రంగా పరిగణించారు. అమాయక ప్రజలనుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావని ఎద్దేవా చేశారు.


Read more; Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..


‘‘ నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో.. 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు మంచి ఇళ్లు కట్టి ఇవ్వోచ్చంటూ జగన్ ను ఏకీ పారేశారు.. అంతేకాకుండా..  ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి?.. నీ ధనదాహానికి అంతులేదా?’’ అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు. ఈ మేరకు మీడియాలో వెలువడిన పలు క్లిప్పింగులను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ ను పెంచేదిగా మారింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter