నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శాశ్వత సిటీ కోర్టు, ఐటీ టవర్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు సిద్ధం అయ్యాయి. వీటిని పరిశీలించిన చంద్రబాబు, ప్రజల అభిప్రాయాన్ని సేకరించి తుది డిజైన్ ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అత్యధికులు ఎంపిక చేసిన రెండు డిజైన్లను ఓకే చేసి, టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ అధికారులను చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సిటీ కోర్టు కోసం12 నమూనాలను, ఐటీ టవర్ కోసం19 నమూనాలను ఆర్కిటెక్ట్ లు తయారుచేశాడని మాత్రి పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, మేము ఆన్లైన్ లో నమూనాలను ఉంచాము. 3,000 మంది ప్రజలు వెబ్సైట్ ను సందర్శించారు. ముఖ్యమంత్రి వద్ద నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత నిర్మాణాల కోసం టెండర్ లను ఆహ్వానిస్తాము' అని ఆయన అన్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమరావతి రాజధాని పరిధిలో వేగవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి అపార్టుమెంట్లను సొంతంగా చేపట్టనుందని.. అక్కడే ఆసుపత్రులు, విద్యా సంస్థలు, రైతు మార్కెట్ ఏర్పాటవుతాయని  తెలిపారు. ఈ అపార్టుమెంట్లను 2, 3 బెడ్ రూమ్ లుగా నిర్మించి, ప్రజలకు వేలం పద్ధతిలో విక్రయిస్తామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం చేపట్టిన 3,840 అపార్టుమెంట్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నాయని, కాలువల పక్కన రెండు నెలల్లో గ్రీనరీ పూర్తవుతుందని నారాయణ తెలిపారు.