Minister Roja: హాయ్ ఏపీ.. బైబై బీపీ.. పవన్ కళ్యాణ్‌కు మంత్రి రోజా కౌంటర్
Minister Roja Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. `హాయ్ ఏపీ.. బైబై బీపీ` అంటూ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా.. చౌకబారు విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Roja Comments on Pawan Kalyan: ఏపీలో ఎన్నికల హీట్ ఓ రేంజ్‌లో ఉంది. ఎలక్షన్స్ ఇంకా సమయం ఉన్నా ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. యువగళం పేరుతో టీడీపీ నేత నారా లోకేష్, వారాహి యాత్ర పేరుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హాలో ఏపీ.. బైబై వైసీపీ అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునివ్వగా.. తాజాగా మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ, జనసేనలకు కాపీ కొట్టడం అలవాటైపోయిందన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టగా.. పవన్ కళ్యాణ్ స్లోగన్‌ను కాపీ కొట్టాడని అన్నారు. 2019లో బైబై బాబు అంటూ వైసీపీ చెప్పిన స్లోగన్‌నే కాపీ కొట్టారని విమర్శించారు.
'హాయ్ ఏపీ.. బైబై బీపీ' అంటూ మంత్రి రోజా సరికొత్త నినాదంతో కౌంటర్ ఇచ్చారు. బీపీ అంటే బాబు.. పవన్ కళ్యాణ్ అని చెప్పారు. జనసేన పార్టీకి గుర్తులేదని.. జిల్లా అధ్యక్షులు కూడా లేరని అన్నారు. 175 స్థానాల్లో అభ్యర్థులు కూడా లేని పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని తరిమేస్తానని కామెంట్స్ విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితిలో లేరని.. టీడీపీ అంతా కాపీ మయం అయిందన్నారు. పద్నాగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. తన మేనిఫెస్టోను పక్కనబెట్టి వైసీపీ మేనిఫెస్టోను కాపీ కొడుతున్నారని విమర్శించారు.
"పవన్ కళ్యాణ్‌కు ఏం అవ్వాలో ముందు క్లారిటీ లేదు. ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని అంటాడు.. మరో రోజు ఎమ్మెల్యే కావాలంటాడు. ఇప్పుడు ఏమో గెలవలేను అని అంటున్నారు. పార్టీ స్థాపించిన వ్యక్తికి.. ప్రజలకు ఏం చేస్తారో క్లారిటీ ఉండాలి. ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పకుండా.. చీప్‌గా విమర్శలు చేస్తున్నాడు. మమ్మల్ని కొడతానని చెప్పాడానికే పవన్ పార్టీ పెట్టాడా..?" అని మంత్రి రోజా ప్రశ్నించారు.
మరోవైపు నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో బిజీగా ఉన్నారు రోజా. నగరి మండలంలో శనివారం రైతులకు జలకళ పథకం కింద రూ.13 లక్షల 60 వేల విలువచేసే విద్యుత్ మోటర్లు పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమం అమలుఫై పుత్తూరు మున్సిపాలిటీ, నగరి రూరల్, పుత్తూరు రూరల్, వడమాలపేట మండలాల సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్
Also Read: Maa Awara Zindagi Movie Review: మా ఆవారా జిందగీ మూవీ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి