Anil Kumar Yadav Audio Leaked: అనిల్ కుమార్ యాదవ్‌కి లోన్ రికవరీ ఏజెంట్ కాల్.. చెప్పుతో కొడతానన్న మాజీ మంత్రి
MLA Anil Kumar Yadav audio call Leaked: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి సైతం లోన్ యాప్స్‌కి సంబంధించిన రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు తప్పలేదు. మంత్రికి, మాజీ మంత్రి లాంటి ప్రజాప్రతినిధులకు కూడా లోన్ రికవరి ఏజెంట్స్ నుంచి వేధింపులా అని ఆశ్చర్యపోతున్నారా ?
MLA Anil Kumar Yadav audio call Leaked: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి సైతం లోన్ యాప్స్‌కి సంబంధించిన రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు తప్పలేదు. మంత్రికి, మాజీ మంత్రి లాంటి ప్రజాప్రతినిధులకు కూడా లోన్ రికవరి ఏజెంట్స్ నుంచి వేధింపులా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఇదిగో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కి ఫోన్ చేసిన ఓ బ్యాంకు రికవరీ ఏజెంట్.. మీరు తీసుకున్న 8 లక్షల రూపాయల అప్పు తీర్చండి అంటూ అడిగారు. నేనే అప్పు తీసుకోలేదు అని అనిల్ కుమార్ యాదవ్ వివరణ ఇవ్వగా.. '' మీ బ్రదర్ ఇన్ లా అశోక్ కుమార్ మీ నెంబర్ ఇచ్చారని.. అప్పు తీసుకున్న డబ్బులు వాడుకున్నప్పుడు ఆ అప్పు కూడా తిరిగి చెల్లించాలి కదా '' అని డిమాండ్ చేశారు.
రికవరీ ఏజెంట్ వైఖరితో చిర్రెత్తుకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్.. ఇంకోసారి నేను డబ్బులు తీసుకున్నాను అని అంటే చెప్పు తీసుకొని కొడతా అంటూ మండిపడ్డారు. దారిన పోయే వాడెవడో నా నెంబర్ ఇచ్చినంత మాత్రాన్నే నేనే డబ్బులు తీసుకున్నా అని ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అశోక్ కుమార్ పేరుతో తనకు బ్రదర్ ఇన్ లాస్ ఎవ్వరూ లేరంటూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్‌కి కాల్ చేసిన కాలర్ ఏ మాత్రం తగ్గేదేలేదన్నట్టుగా.. మరి డబ్బులు ఎవరు కడతారు అంటూ రివర్స్ ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో కాల్‌ని మీరు కూడా వినండి.. అసలు కథేంటో మీకే అర్థం అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook