Yuvagalam Navasakam Public Meeting Updates: నారా లోకేశ్‌ పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల మధ్య విజయవంతంగా కొనసాగిందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని.. వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తు పెట్టుకోవాలని రాష్ట్ర యువతకు సూచించారు. 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందని.. ప్రస్తుతం యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చిందన్నారు. నారా లోకేశ్‌పై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారు. చంద్రబాబు తన విజన్ తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి పేదలకు అండగా నిలిచారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలను పరిచయం చేశాడు. రాష్ట్రాభివృద్ధిని నిర్వీర్యం చేసి 10 లక్షల రూపాయల కోట్ల అప్పు చేశాడు. అరాచక పాలనలో ధరలు, పన్నులు, రేట్లు ఆకాశాన్నంటాయి. సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకమైంది. జగన్ ల్యాండ్, శాండ్, మైన్ స్కాములతో దోచుకుంటున్నాడు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నాడు. మన రాష్ట్రానికి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించాడు. అక్రమ కేసులతో బెదిరిస్తున్నాడు." అని బాలకృష్ణ విమర్శించారు.


జగన్ పాలనలో రాష్ట్రంలో ఒక్క గుంత పూడ్చలేదని.. ఒక్క రోడ్డు వేయలేదని మండిపడ్డారు బాలకృష్ణ. సీఎం కుర్చీలో జగన్ కనకపు సింహాసనంపై శునకం మాదిరి ప్రవర్తిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి తెలంగాణకు సీఎం అవుతానంటే అక్కడి ప్రజలు రాష్ట్ర సరిహద్దు వద్దే అడ్డుకుంటారని అన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రపంచ పటంలో ఏపీ ఉండదని.. ఇది తథ్యమన్నారు. 


సమయం లేదు మిత్రమా.. వచ్చే ఎన్నికల్లో విజయమా..? వీరస్వర్గమా..? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలంటూ సినిమా స్టైల్లో డైలాగ్ చెప్పారు. తన సొంత సామాజికవర్గానికి ఎమ్మెల్యేల స్థానాలను మార్చకుండా.. ఎస్సీ, బీసీలను మాత్రమే ఓడిపోయే స్థానాలకు పంపిస్తున్నాడని.. ఇదేక్కడి సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో సుపరిపాలనకు స్వాగతం పలకాలని.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రజలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఎవడు అడ్డొస్తాడో తాము చూస్తామని.. ముందడుగు వేయాలని కోరారు.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook