తెలుగు రాష్ట్రాల్లో మరో మారు మోగిన ఎన్నికల నగారా !!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో మారు ఎన్నికల నగారా మ్రోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ను అనుసరించి ఏపీలో మొత్తం మూడు స్థానాల్లో ఎన్నిక నిర్వహిస్తుండగా.. తెలంగాణలో ఒక స్థానంలో ఎన్నిక నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇదే......
తాజాగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ను పరిశీలిచిననట్లయితే ఏపీ, తెలంగాణలో రాష్ట్రాల్లో కలిపి మొత్తం నాలుగు స్థానాలకు ఈ నెల 7న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. కాగా.. 16న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, 19 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. కాగా ఈ నెల 26వ తేదీన ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు.
ఎన్నికలు ఎందుకంటే....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేత కరణం బలరాం, వైసీపీ నేతలు ఆళ్లనాని, కోలగట్ట వీరభద్రస్వామి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇటీవలె జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం వల్ల వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన స్థానాల్లో ఎన్నికలు అనివార్యమయ్యారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ యాదవరెడ్డి స్థానంలో కొత్త వారికి ఎన్నికోవాల్సి ఉంది. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక యాదవరెడ్డి పార్టీ ఫిరాయించారనే కారణంగా ఆయనపై అనర్హత వేటు పడింది ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.