AP: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలో మరో మూడ్రోజులపాటు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో తేలికిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో ( Ap ) మరో మూడ్రోజులపాటు వర్షాలు )( Rains in ap ) పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో తేలికిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ( Bay of Bengal ) లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ( Depression ) ఇంకా కొనసాగుతోంది. వాస్తవానికి ఉత్తర తీర ప్రాంతాలలో మంగళవారం ఉదయం బలహీనపడినా..తిరిగి అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ కారణంగా రానున్న మూడ్రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే... రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి, మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు జిల్లాలో మాత్రం అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చు. ఇక ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కొస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains ) పడే అవకాశాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో పడే అవకాశాలున్నాయి. Also read: AP: నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష