Nagababu: ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ రాజ్యసభ ఎంపీల రాజీనామాతో పెద్దల సభకు ఎన్నిక అవివార్యమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా కొలువు దీరిన కూటమి ప్రభుత్వం  రాజ్యసభ అభ్యర్థుల సస్పెన్స్‌కు తెరపడేలా చేసింది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ  నుంచి బీద మస్తాన్‌ రావ్‌, సానా సతీష్‌ను ఎంపిక చేసారు. సానా సతీష్.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తీరా ఉదయ్ శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కాకినాడ లోక్ సభకు 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు సానా సతీష్ పై అప్పట్లో ఈడీ కేసులు, రెండు ప్యాన్ కార్డ్స్ ఉన్నాయనే కారణంతో ఆయన్ని పక్కన పెట్టారు. తాజాగా ఈయనకు జనసేన కోటాలో టీడీపీ తరుపున రాజ్యసభకు వెళుతున్నారు. ఇక ఏపీలో ఖాళీగా మూడో స్థానం నుంచి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్యను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈయన 2014 ఎన్నికల్లో ఎల్ బి నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి ఎన్నికల్లో టీడీపీ ఎన్డీయే తరుపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన  సంగతి తెలిసిందే కదా.  


ఇక  జనసేన నుంచి కొణిదెల నాగేంద్ర బాబుకు ఛాన్స్‌ దక్కుతుందన్న ప్రచారాలకు తెరపడింది. నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ల భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారికి రాజ్యసభ సీటును టీడీపీకే వదిలేసినట్లు సమాచారం. దాంతో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్‌ దక్కింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదో తేదీ వరకు నామినేషన్ల గడువు ముగియనుంది. ముగ్గురే అభ్యర్థులు నామినేషన్ వేస్తుండటంతో వారి ఎన్నిక లాంఛనం కానుంది. ఇక వైసీసీకి రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో తెలుగు దేశం పార్టీ ఉనికిలో ఉండేది. కానీ గత రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో టీడీపీ సభ్యత్వం లేకుండా పోయింది. తాజాగా ఈ ఉప ఎన్నికతో మళ్లీ రాజ్యసభలో టీడీపీ ప్రస్థానం తిరిగి ప్రారంభం కానుంది.


ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..


ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.