Mega Family: మెగా కుటుంబంలో చిరంజీవి అప్పట్లో 2008లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికల్లో బలమైన వైయస్. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి నేతలను ఎదురొడ్డి నిలబడి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం ఓట్లు సంపాదించారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో మొత్తం 18 సీట్లు గెలిచారు. చిరంజీవి పాలకొల్లు నుంచి ఓడిపోయి.. తిరుపతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. అంతేకాదు ఆ పార్టీ తరుపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతేకాదు అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రిగా స్వతంత్ర్య హోదాలో పనిచేసారు. ఆ తర్వాత 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీ అయిన మూడు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మూడు స్థానాల్లో ఒకటి జనసేనకు దక్కనుంది. ఈ స్థానం నుంచి మెగా బ్రదర్ ను నాగబాబను రాజ్యసభకు పంపించే యోచనలో ఉంది జనసేన. ఒకవేళ నాగబాబు రాజ్యసభకు ఎన్నికైత.. అన్నయ్య చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన రెండో వ్యక్తిగా నాగబాబు రికార్డు క్రియేట్ చేయనున్నారు. అంతేకాదు భవిష్యత్తులో జరగబోయే కేంద్ర క్యాబినేట్ లో ఆయన బెర్త్ కూడా కన్ఫామ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి నాగబాబు ఈ సారి జరిగే రాజ్యసభ ఉప ఎన్నికల్లో పెద్దల సభకు వెళతారా అనేది చూడాలి.
తాజాగా ఏపీ ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషనర్. డిసెంబర్ 3 నుంచి 10 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నిక అనివార్యమైతే డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. లేకపోతే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపికైన ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో మూడు సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మూడు రాజ్యసభ సీట్లు ఎన్డీయే కూటమికే దక్కనున్నాయి. మూడింటిలో ఒకటి జనసేనకు,బీజేపీ, టీడీపి దక్కనున్నాయి జనసేనకు ఇస్తే నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter