TDP Launches Nalugella Narakam To Defeat YSRCP: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో కొత్త జోష్ నింపుకున్న టీడీపీ.. తాజాగా మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే కసితో ఉన్న తెలుగు దేశం పార్టీ తాజాగా 'నాలుగేళ్ల నరకం' అనే పేరుతో ఒక కొత్త తరహా పొలిటికల్ క్యాంపెయిన్ కి రంగం సిద్ధం చేసింది. గత నాలుగేళ్ల కాలంలో అధికార పార్టీ వైఫల్యాలను హైలైట్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నమే ఈ " నాలుగేళ్ల నరకం " అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. 'ఇది రాష్ట్రమా....? రావణ కాష్ఠమా..?' అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు గురించి చంద్రబాబు నాయుడు ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేనందున ఇకపై రాబోయే రోజుల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు, పల్లెటూళ్ల నుంచి పట్టణాల వరకు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకి జరిగిన అన్యాయాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల అవినీతి, అక్రమాలను ఎత్తి చూపి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతోనే తమ పార్టీ ముందుకు సాగుతుంది అని టీడీపీ నేతలు తెలిపారు. 


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో గత నాలుగేళ్లుగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందులు, సమస్యలను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పడమే తమ ఈ " నాలుగేళ్ల నరకం " కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలుగు దేశం పార్టీ కీలక నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నెల రోజుల పాటు పల్లెల నుంచి పట్టణాల వరకు వివిధ వేదికలపై జరగనున్న ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలుగు తమ్ముళ్లు తెలిపారు.


ఇది కూడా చదవండి : Pawan Kalyan Janasena: రెమ్యునరేషన్‌పై పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!


సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన నాలుగేళ్ల నరకం ప్రచార కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేస్తున్నారు. నాలుగేళ్ల నరకం ప్రచార కార్యక్రమంలో భాగంగా గత నాలుగేళ్లలో వివిధ రంగాలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్రాన్ని నలభై ఏళ్లు ఎలా వెనక్కి నెట్టారో ప్రజలకు వివరించనున్నారు.


ఇది కూడా చదవండి : AP Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK