Heavy Rains Alert to AP & TG: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు

Monsoons Effect in AP & TG: తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు విస్తరిస్తుండడంతో వర్షాలు మొదలయ్యాయి. భానుడి ప్రకోపానికి అల్లాడిపోయిన ప్రజలు.. వర్షాల రాకపోతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అన్నదాతలు పంటలు సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 24, 2023, 10:14 AM IST
Heavy Rains Alert to AP & TG: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు

Monsoons Effect in Andhra Pradesh and Telangana: భానుడి భగభగల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉపశమనం పొందనున్నారు. గత కొద్ది రోజులు పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవ్వడంతో ప్రజలు అల్లాడిపోయారు. రుతుపవనాలు రాకపోవడంతో వర్షాలు లేక.. సూర్యతాపానికి తాళలేక పగటి వేళ బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గతేడాది కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. అయితే విస్తరించకుండా ఆగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు కురవలేదు. బుధవారం రుతుపవనాలు విస్తరించడం మొదలవ్వడంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. నిన్న విజయవాడ, రాజమండ్రి తదితర నగరాల్లో భారీ వర్షాలకు కురిశాయి. ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు తడిసిముద్దయ్యారు.

రుతుపవనాల ప్రభావంతో గురువారం ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

Also Read: Hyderabad Rains: రుతుపవనాలొచ్చేశాయి, వర్షాలతో పులకరించిన హైదరాబాద్, సేద తీరిన జనం

ఒడిశా, బెంగాల్, బీహార్, జార్ఖండ్, తూర్పు యూపీకి రుతుపవనాలు పురోగమిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.  హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యూపీలో కూడా జూన్ 25 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 24, 25వ తేదీల్లో ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. 

బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాయలసీమ, అండమాన్-నికోబార్ దీవులు, తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. అస్సాం, సిక్కింలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా మహారాష్ట్ర, కొంకణ్, గోవాలలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Also Read: YS Jagan Review: పనితీరు మెరుగుపర్చుకోకపోతే నో టికెట్, ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News