Nandamuri Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదంటూ స్థానిక బీజేపీ నేతలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలకృష్ణతో పాటు స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆచూకీ లేకుండా పోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో... ఈ ముగ్గురు నేతల నుంచి స్పందన కరువైందని బీజేపీ నేతలు ఆరోపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకనైనా నందమూరి బాలకృష్ణ, గోరంట్ల మాధవ్, మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం ప్రజల డిమాండుపై స్పందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అవసరమైతే పదవులకు రాజీనామా చేసైనా సరే.. జిల్లా కేంద్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలన్నారు. స్థానిక ప్రజల డిమాండుపై స్థానిక ప్రజాప్రతినిధులే మౌనం వహిస్తే ఎలా అని ప్రశ్నించారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26కి పెంచాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని హిందూపురం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా కాకుండా హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే స్థానికుల ఆందోళనలకు ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ మద్దతు తెలపకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇదివరకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. హిందూపురంలో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని.. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని... కాబట్టి హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి. 


Also Read: Murder: చిరంజీవి డైలాగ్‌‌ను నిజం చేసిన ఘటన.. మొక్కే కదా అని పీకేసినందుకు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook