Bala krishna On NTR: పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.. సీఎం జగన్ కు బాలయ్య వార్నింగ్
Bala krishna On NTR: విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై హీరో నందమూరి బాలకృష్ట స్పందించారు. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bala krishna On NTR: విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై హీరో నందమూరి బాలకృష్ట స్పందించారు. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్చేయడానికి, తీసెయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఓ సంస్క్కతి, ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక అన్నారు బాలయ్య. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నారు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ హెచ్చరించారు.
అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని బాలకృష్ణ తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బతుకున్నారంటూ బాలయ్య చేసిన కామెంట్లు.. కొడాలి నాని, వల్లభనేని వంశీని ఉద్దేశించే చేసినట్లుగా భావిస్తున్నారు.
[[{"fid":"246065","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది జగన్ సర్కార్. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకుంది. ఏపీ సర్కార్ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర విపక్షాలు ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని తప్పుపట్టాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ తో పాటు వైఎస్సార్ ను మహానీయుడిగా చెప్పారు జూనియర్. ఒకరి పేరు తీసి ఒకరు పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని అన్నారు. హెల్త్ వర్శిటీకి ఎన్టీఅర్ పేరు మార్చడం బాధాకరమని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Also Read: Ind vs Aus 2nd T20 Match: ఆసిస్‌పై టీమిండియా విజయం.. ఉప్పల్ మ్యాచ్‌పై పెరిగిన ఉత్కంఠ
Also Read: Pooja Hegde Hot Photos: ఎద అందాలు ఆరబోస్తున్న బుట్టబొమ్మ.. క్లీవీజ్ కనిపించేలా ట్రీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి