Nandamuri Balakrishna warns YSRCP : అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిందిపోయి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తమ సోదరి భువనేశ్వరిపై (Nara Bhuvaneshwari) వ్యక్తిగతంగా దాడి చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపై విమర్శలు సరికాదన్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగి మాట్లాడితే ఇక సహించేది లేదని హెచ్చరించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని... ఇప్పటివరకూ చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లే తాము ఆగామని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాటి పరిణామాలపై బాలకృష్ణ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసెంబ్లీ అన్నాక సభ హుందాగా జరగాలని బాలకృష్ణ (Nandamuri Balakrishna) పేర్కొన్నారు. కానీ అక్కడ స్పీకర్ ఏకపక్షంగా సభను నడుపుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలకు దిగితే తామేమీ చేతులు కట్టుకుని కూర్చోలేదని హెచ్చరించారు. వాళ్ల ఇంట్లో ఆడవాళ్లు సైతం వారిని ఛీదరించుకుంటున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇది మంచి సంస్కృతి కాదని... ఇకనైనా మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని తమ కుటుంబం నిర్ణయం తీసుకుందన్నారు.


Also Read: నారా భువనేశ్వరికి పురంధేశ్వరి సంఘీభావం... నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని...


'అధికార పార్టీ వాళ్లు మైండ్ గేమ్ ప్లే చేస్తున్నామని అనుకుంటున్నారు... కానీ ఏదీ శాశ్వతం కాదు... ఇవాళ మీరు... రేపు మళ్లీ మేము అధికారంలోకి రావొచ్చు. మీ పాలన ఎలా ఉందో జనం చూస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు హయాంలో ఏ వర్గానికి లోటు రాకుండా చూసుకున్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు (Chandrababu Naidu) చెప్పడం వల్లే సహనం పాటించాం. ఇకపై ఆయన అనుమతి కూడా మాకు అవసరం లేదు. నా అభిమానుల తరుపున, కుటుంబం తరుపున, పార్టీ తరుపున ఇదే నా హెచ్చరిక... మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు... ఒక్కొక్కరి భరతం పడుతాం... ఖబడ్దార్...' అంటూ బాలకృష్ణ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook