నంద్యాల ఉపపోరు యువ మంత్రి  అఖిల ప్రియకు అగ్నిపరీక్షలా మారింది. ఈ పరీక్షలో ఆమె ఎలా నెగ్గుకొస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత  నెలకొంది. ఈ ఉత్కంఠ పోరులో తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకొని తీరుతానని ..లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఏపీ మంత్రి అఖిల ప్రియ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప పోరు అఖిలకు జీవన్మమణ సమస్యగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుభవరాహిత్యమే మైనస్..


ఉపపోరును సవాల్ గా తీసుకున్న అఖిలప్రియ తన సోదరుడి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్దుతున్నారు. తనదైన శైలిలో పోరాటం సాగిస్తున్నారు. తాజా పరిణామాలను గమనిస్తూ ఎప్పటికప్పుటి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అయితే ఇక్కడ అనుభవరాహిత్యమే అఖిలకు మైనస్ పాయింట్ మారింది. అయితే దీన్ని ఆత్మ విశ్సాసంతో నెగ్గుకొస్తానంటున్నారు యువ మంత్రి. అయితే ఈ సవాలు అంత సులభమైందేమీ కాదునే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..ప్రత్యర్ధి తల పండిన రాజకీయ నేత శిల్పా మోహన్ రెడ్డి. ఆయన కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని జీవన్మరణ సమస్యగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప పోరు ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


అఖిల ప్లస్ పాయింట్స్..


ప్రత్యర్ధి వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే అఖిల విజయవకాశాలు ఆధారపడి ఉంది. పార్టీ అధికారంలో ఉండటం, సీఎం చంద్రబాబు ఆశీస్సులు పుష్కలంగా లభించడం. తండ్రి భూమా నాగిరెడ్డి అనుచరుల మద్దతు వంటి అంశాలు ఆమెకు ప్లస్ పాయింట్ పరిగణిస్తున్నాయి. ఈ అనుకూల అంశాలను ఆమె ఏ రీతిలో ఉపయోగించుకుంటారనే దానిపైనే అఖిల ప్రియ సక్సెస్ ఆధారపడి ఉంది. 


గెలిస్తే ..తిరగులేని నేతగా అఖిల..


ఈ పోరులో శిల్పా సోదరుల రాజకీయ వ్యూహాలను ఆమె సమర్థవంతంగా ఎదుర్కొని గెలుపు సాధిస్తే  అటు పార్టీలోను..ఇటు జనంలోను ఆమెకంటూ సొంత ఇమేజ్ ఏర్పడుతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఆమె తన తల్లి శోభానాగారెడ్డి లాగే ధీటైన మహిళా నేతగా తయారౌతారు. ఓడితే మాత్రం ఆమె భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే భూమా మరణంపై జనాల్లో ఉన్న సానుభూతికి తోడు అఖిలప్రియ రాటుదేరాల్సి ఉంది.