Nara Bhuvaneshwari: ఏపీ అసెంబ్లీ ఘటనపై నారా భువనేశ్వరి బహిరంగ లేఖ...
Nara Bhuvaneshwari: ఇటీవలి అసెంబ్లీ పరిణామాలపై నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై నేరుగా స్పందించని భువనేశ్వరి... తాజాగా బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో తన అభిప్రాయాలను వెల్లడించారు.
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసినవారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) బహిరంగ లేఖ విడుదల చేశారు.
'నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసినవారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకి, కూతురికి జరిగినట్లుగా భావించి.. నాకు అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మ గారు, నాన్న గారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను.' అని భువనేశ్వరి (Nara Bhuvaneshwari) బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
[[{"fid":"216172","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
గత వారం అసెంబ్లీలో (AP Assembly) చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. సభలో తన భార్య పేరును ప్రస్తావించి... ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలపై (YSRCP) చంద్రబాబు ఆరోపణలు చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత దారుణమైన అవమానాలను ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు, అసెంబ్లీలో తీవ్ర భావోద్వేగానికి లోనైన చంద్రబాబు... మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు.
Also Read: Fake Baba : తల్లి ఆరోగ్యం బాగా చేస్తానని నమ్మించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై బాబా అత్యాచారం
అసెంబ్లీ పరిణామాలు, చంద్రబాబు ఆవేదనపై నందమూరి ఫ్యామిలీ స్పందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కావొద్దని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం...అసెంబ్లీలో అసలు భువనేశ్వరి ప్రస్తావనే రాలేదని చెప్తున్నారు. తాము అనని మాటలు అన్నామని చెప్పి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నాడని.. సానుభూతి కోసమే ఈ డ్రామాకు తెరలేపాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని విమర్శిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook