అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. కుటుంబంలోని ఐదుగురి వ్యక్తిగత ఆస్తులతో పాటు తమ కుటుంబానికి చెందిన స్థిర,చర ఆస్తుల వివరాలు వెల్లడించారు. నారా కుంటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 88.68 కోట్లుగా నారా లోకేష్ ప్రకటించారు. గత ఏడాది కంటే రూ.13 కోట్ల వరకు చంద్రబాబు కుంబుంబ ఆస్తుల పెరిగాయి. ఇదిలా ఉండగా తాజా ప్రకటనతో వరుసగా 8వ సారి నారా కుంటుంబం తమ ఆస్తుల వివరాలు ప్రకటించినట్లయింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 చర, స్థిర ఆస్తుల వివరాలు: 


*  నారా కుంటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 88.68 కోట్లు
* చంద్రబాబు పేరు మీద ఉన్నఆస్తుల విలువ రూ. 2.9 కోట్లు
* భూవనేశ్వరీ ఆస్తుల విలువ రూ.31.01 కోట్లు
* నారాలోకేష్ ఆస్తుల విలువ రూ.21.40 కోట్లు
* నారా బ్రహ్మిణి ఆస్తుల విలువ రూ.7.72 కోట్లు
* దేవాన్ష పేరు మీద ఉన్న ఆస్తుల విలువ రూ. 18.71



*  నారావారిపలెలో ఇంటి ఖరీదు రూ.23.83 కోట్లు
* హైదరాబాద్ ఇంటి ఖరీదు రూ. 8 కోట్లు
* హెరిటేజ్ ఆస్తుల నికర లాభం రూ. 60.38 కోట్లు


* నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు రూ. 6.83 కోట్లు
*చంద్రబాబు అప్పులు రూ.5.31 కోట్లు
* భువనేశ్వరి అప్పులు రూ. 22.35 కోట్లు

* తిత్లి తుపాను సహాయం కోసం రూ. 60 లక్షల సాయం


ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరంలో వివిధ మార్గాల ద్వార తమ కుటుబానికి వచ్చిన నికర లాభం 6,038 కోట్లు అని వెల్లడించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు జవాబుదారితనంతో మెలగాల్సి ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఆస్తుల వివరాలు ప్రకటిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ తమపై ప్రతిపక్ష పార్టీలు బుదరజల్లుడం శోచనీయమన్నారు.