రాజన్న రాజ్యంలో రాక్షస పర్వం - ట్విట్టర్ వేదికగా లోకేష్ ఘాటు విమర్శలు
సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కార్ తీరుపై నారా లోకేష్ దుమ్మెత్తి పోస్తున్నారు
టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని గత కొంత కాలం నుంచి వైసీపీ శ్రేణులపై టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ ఓ ఫోన్ వాయిస్ రికార్డును ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కార్ తీరుపై నారా లోకేష్ దుమ్మెత్తి పోశారు. తమ పార్టీ కార్యకర్తలకు ఎలా వేధిస్తున్నారనే దానికి ఇదే ఉదాహణగా వేధింపులకు సంబంధించి ఫోన్ రికార్డును తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ చూడండి ముఖ్యమంత్రిగారు.. పార్టీ మారను అన్న పాపానికి ఒక టీడీపీ నాయకుడిని ఎలా హింసిస్తున్నారో చూడండి .. ఆ టీడీపీ నేత భార్యను ప్రస్తావిస్తూ మీ వైసీపీ నేతలు వాడిన భాష ఎంత జుగుప్సాకరంగా ఉందో విని సిగ్గుపడండి అంటూ అంటూ ఫోన్ వాయిస్ రికార్డును జత చేశారు. ఇదీ మీ రాజన్నరాజ్యంలో జరుగుతున్న రాక్షస పర్వం..అని లోకేష్ ఘాటుగా విమర్శించారు.
>