Nara lokesh reaponds on child begging incident: ఆంధ్ర ప్రదేశ్‌ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు సర్కారు.. గత పాలకులు చేసిన తప్పిదాలను అసెంబ్లీలో ఎత్తి చూపుతునే మరోవైపు.. ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తున్నారు. ఇటీవల ఏపీలో సోషల్ మీడియాల్లో అసత్య ప్రచారం.. ట్రోలింగ్ లు చేస్తు పోస్టులు పెడుతున్న వారి పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా...  ఆర్జీవీ, శ్రీరెడ్డి, పోసానికి సైతం పోలీసులు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా కర్నూల్ నడిబొడ్డును జరిగిన ఒక ఘటనను నెటిజన్ ఏపీ మంత్రి నారాలోకేష్ కు ట్యాగ్ చేశారు. దీనిపై మంత్రి చాలా ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.



 


పూర్తి వివరాలు..


బాల్యం అనేది ఒక వరంలాంటిది. కల్ల కపటం లేకుండా.. బుడి బుడి అడుగులు వేసుకుంటూ చిన్నారులు సందడి చేస్తుంటారు. మనకు ఎన్ని టెన్షన్ లు ఉన్నా.. ఎంత ఒత్తిడిలో ఉన్న.. చిన్నారుల పనులు చేస్తే వెంటనే నవ్వొస్తుంది.  అవన్ని మర్చిపోతుంటాం.  అందుకు ప్రతి ఒక్కరు చిన్నప్పుడు బాగుండేదని తమ బాల్యంను గుర్తు చేసుకుంటు ఉంటారు.


అయితే.. కర్నూల్ నగరంలో ఒక పిల్లాడ్ని.. ఒళ్లంతా సిల్వర్ రంగు పూసి.. మరీ యాచించడం కోసం కూర్చుండబెట్టారు. పాపం.. అతను ఒక వేడి, మరొవైపు నిద్ర వస్తుండటంతో తూలుతూ.. రోడ్డుమీద కూర్చుండిపోయాడు. ఈ వీడియోను ఒక నెటిజన్ నారా లోకేష్ కు ట్యాగ్ చేయగా.. దీనిపై ఆయన వెంటనే స్పందించారు.


Read more: Tirumala: తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన.. ఏంజరిగిందంటే..?


వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, అందమైన చిన్న తనంలో ఇన్ని కష్టాల.. అని లోకేష్ చలించిపోయారు. ఆ పిల్లొడికి అండగా తాముంటామని.. అతనికి ఇలాంటి పరిస్థితి కల్పించి వారిపై చర్యలు తీసుకొవాలని కూడా ఎక్స్ వేదికగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీనిపై  ప్రజలు కూడా  తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.