అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే సందర్భంలో నారా లోకేష్ రాజన్న రాజ్యంపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ సెటైర్లు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోకేష్ ఏమన్నారంటే...
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల, తూటాలతో రైతులను పిట్టలను కాల్చినట్టు కాల్చినందువల్ల దేశంలో అందరూ ఆ రాజుగారి గురించి మాట్లాడుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. ఆ రాజుగారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతోంది. కాలమహిమ ! అంటూ ట్టిట్వర్ వేదిగా కామెంట్ చేసి వైఎస్ హయంలోని రైతుల సమస్యలకు సంబంధించిన పేపర్ కటింగ్ జత చేశారు నారా లోకేష్.



 


నారా లోకేష్ దూకుడు


గత కొంత కాలం నుంచి  జగన్ పై సర్కార్  తీరుపై నాారా లోకేష్ పదునైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైపీసీ శ్రేణులు కూడా దీటుగా బదులిస్తున్నారు. ఈ రోజు వైఎస్ జయింతి పురస్కరించుకొని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.