Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పేరు ఎత్తకుండానే అతడి ప్రభుత్వంపై విమర్శానాస్త్రాలు సంధించారు. ఏపీలో వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంతో వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP New DGP: ఏపీ కొత్త పోలీస్‌ బాస్‌ హరీశ్‌కుమార్‌ గుప్తా.. గంటల్లోనే వేగంగా మారిన పరిణామాలు


అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం రాజమహేంద్రవరంలో పర్యటించారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ తన ప్రభుత్వం ఘనతలు చెబుతూనే జాతీయ, రాష్ట్ర రాజకీయ అంశాలను లేవనెత్తారు. 'గోదావరి మాతకు ప్రణామం. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఈ భూమి మీద నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాం. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుంది' అని ప్రకటించారు. 

Also Read: CID Case: చంద్రబాబు, లోకేశ్‌కు ఈసీ ఝలక్‌.. ఇద్దరిపై సీఐడీ కేసు నమోదుతో ఏపీలో కలకలం


'ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజనీర్ సర్కార్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని తిరస్కరించారు. వైసీపీకి ఇచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ గ్యారెంటీ.. చంద్రబాబు నేతృత్వంలో పవన్ కల్యాణ్ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనుంది' అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.


జార్ఖండ్‌లో కాంగ్రెస్ మంత్రుల నుంచి నోట్ల కట్టలు బయటపడడంపై ప్రధాని మోదీ స్పందించారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ మంత్రుల నుంచి నోట్ల కట్టలు బయటపడడంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మోదీ సవాల్‌ విసిరారు. అవినీతి డబ్బు పేదలకు దక్కేలా కొత్త చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. 


వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు
'ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సున్నా. అవినీతి 100 శాతం. సాంకేతిక పరిజ్ఞానంలో ఏపీ యువత నైపుణ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించలేదు. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలి. ఏపీ అభివృద్ధిలో వెనక్కి వెళ్లేలా వైసీపీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని వైసీపీ పట్టాలు తప్పించింది. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. 


'వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేసింది. మూడు రాజధానుల పేరుతో వైసిపి ప్రభుత్వం లూటీ చేయాలని చూసింది. ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయిపోయింది. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిలిపివేసింది' అని మోదీ విమర్శలు చేశారు. జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలన్నిటినీ దూరం చేసే ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని ప్రకటించారు.


ఎన్టీఆర్‌పై ప్రశంసలు
సభలో టీడీపీ వ్యవస్థాపకులు, సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్‌ శ్రీరాముడు పాత్రను పదేపదే ధరించి రాముని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్డీయే ప్రభుత్వం భవ్య రామ మందిరం నిర్మించిందని చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter