Harishkumar Gupta: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డీజీపీ ఆకస్మిక బదిలీ అయ్యారు. ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించడంతో డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ బదిలీ అయ్యారు. ఖాళీ ఉన్న స్థానంలో 24 గంటల్లోపే కొత్త వ్యక్తిని ఎన్నికల సంఘం నియమించింది. కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించింది.
Also Read: CID Case: చంద్రబాబు, లోకేశ్‌కు ఈసీ ఝలక్.. ఇద్దరిపై సీఐడీ కేసు నమోదుతో ఏపీలో కలకలం
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ అధికార పార్టీకి సహకరిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. డీజీపీ వ్యవహార శైలిపై తెలుగుదేశం, జనసేన పార్టీలు ఫిర్యాదులు చేశాయి. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడంతో ఈసీ చర్యలు చేపట్టింది. ఆదివారం సాయంత్రం డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ బదిలీ చేయగా.. వెంటనే కొత్త వ్యక్తిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది.
Also Read: Ambati Rambabu: మా మామకు ఎవరూ ఓటేయొద్దు.. అంబటి రాంబాబు అల్లుడు ఓటర్లకు పిలుపు
సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారక తిరుమలరావు (ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ), మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆ ముగ్గురిలో 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ఈ మేరకు ఈసీ సోమవారం ప్రకటన జారీ చేసింది. సాయంత్రం 5 గంటల్లోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter