AP SEC Neelam Sahani: ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమీషనర్‌గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణతో  కొత్త ఎస్ఈసీగా ప్రభుత్వం నీలం సాహ్నిని గవర్నర్ నియమించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)అనంతరం నిన్న అంటే మార్చ్ 31వ తేదీన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఇవాళ అంటే ఏప్రిల్ 1 వ తేదీన ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమీషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుఛ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు. కొత్త ఎన్నికల కమీషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపింది. దాని ప్రకారం నీలం సాహ్ని(Neelam Sahani) పేరును ఎస్ఈసీగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్(Viswabhushan Harichandan) ఖరారు చేశారు.


ఇప్పటివరకూ ఎన్నికల కమీషనర్‌గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్(Nimmagadda Ramesh kumar) పదవీ విరమణ రోజున ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అయితే 2020 మార్చ్ నుంచి మొన్న ఎన్నికలు ముగిసేవరకూ ప్రభుత్వం, మంత్రులతో ఆయన వివాదం కొనసాగుతూనే ఉంది. 2020 మార్చ్‌లో కరోనా కేసులు పెద్దగా లేనప్పుడు ఆ కారణంతో ఎన్నికల్ని వాయిదా వేసిన నిమ్మగడ్డ..ప్రభుత్వంతో ప్రతి విషయానికీ ఘర్షణ పడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా బాథ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని..ముందుగా నిలిచిపోయిన ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉంది. 


Also read: Tirupati Bypoll: విజయం కాదు..మెజార్టీపై దృష్టి సారించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook