NEET Exam 2021: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్ష మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా పది పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పరీక్షా కేంద్రానికి వేటిని అనుమతిస్తారు..వేటిని అనుమతించరనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ పరీక్షకు(NEET Exam 2021) ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా మెడికల్ , డెంటల్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ ఇవాళ జరగనుంది. మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నీట్ పరీక్ష జరగనుంది. ఏపీలో నీట్ పరీక్ష కోసం పది పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుంది. ఏపీ నుంచి మొత్తం 59 వేల మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి మొత్తం 5 వేల సీట్లున్నాయి. 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుండగా,15 శాతం సీట్లు నేషనల్ పూల్ అంటే కేంద్ర కేటాలో భర్తీ అవుతాయి. 15 శాతం సీట్లను కేంద్ర కోటాకు కేటాయించడం ద్వారా..దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలిచ్చే 15 శాతం కోటాకు రాష్ట్ర విద్యార్ధులు పోటీపడవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో 11, ప్రైవేటు పరిధిలో 18 కళాశాలలున్నాయి.


విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి గంటముందు వచ్చేలా సిద్దం కావాలి. మద్యాహ్నం 1.30 నిమిషాలకు పరీక్షే కేంద్రానికి చేరుకుని ఇన్విజిలేటర్‌కు అడ్మిట్ కార్డు చూపించగలగాలి. 1.45 నిమిషాలకు బుక్‌లెట్ ఇస్తారు. 1.50 నిమిషాలకు బుక్‌లెట్‌లో వివరాలు నింపాల్సి ఉంటుంది. ఆలస్యంగా వస్తే నిబంధనల మేరకు పరీక్షకు అనుమతించరు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా తీసుకురావాలి. ప్రభుత్వ గుర్తింపు కలిగిన కార్డులు అంటే పాన్‌కార్డు, ఆధార్ కార్డ్(Aadhaar Card), ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలి. కోవిడ్ నిబంధనల(Covid protocols)మేరకు గ్లౌజ్ ధరించాలి. శానిటైజర్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. 


పరీక్షా కేంద్రానికి అనుమతి లేనివి


ఎలక్ట్రానికి వస్తువులు, సెల్ ఫోన్, ఆభరణాలు తీసుకు రాకూడదు. చెవులకు ధరించే ఆభరణాలు, బ్రాస్‌లెట్, వేలి ఉంగరాలు, ముక్కు పిన్‌లు , ఛైన్‌లు, నక్లెస్‌లు , పెండెంట్‌లు పెట్టుకోకూడదు. పేపర్లు, జామెట్రీ బాక్స్‌లు, పెన్సిల్ బాక్స్‌లు, క్యాలిక్యులేటర్, ప్లాస్టిక్ పౌచ్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరేజర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్స్ , బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, పేజర్స్, హెల్త్‌బ్యాండ్స్, పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్ , క్యాప్, స్కార్ప్, కెమేరా వంటివి నిషేధం.


Also read: Gold Smuggling: బంగారాన్ని అలా కూడా స్మగుల్ చేస్తారా..అడ్డంగా పట్టుబడ్డ ఇద్దరు విదేశీయులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook