Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కోణంలో ప్రయత్నించి అడ్డంగా పట్టబడ్డారు ఆ ఇద్దరు.
బంగారం ధర పెరిగేకొద్దీ స్మగ్లింగ్(Gold Smuggling) కూడా పెరుగుతోంది. రోజురోజుకూ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువవుతున్నాయి. కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని స్మగుల్ చేస్తున్నారు. ఓ దేశం నుంచి మరో దేశానికి బంగారం తరలించేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విఫలమవుతుంటాయి. ఓ తమిళ సినిమాలో ఇలాగే బంగారాన్ని కడుపులో దాచుకుని ప్రయాణిస్తాడు. అదే కోవలో ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు.
ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు బంగారం స్మగ్లింగ్ కోసం ఓ విచిత్ర పద్దతి ఎంచుకున్నారు. తెలివిగా నోట్లో బంగారం పెట్టుకుని ప్రయాణించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఉజ్బెకిస్తానీలను ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో(Delhi Airport) కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఇద్దరూ 951 గ్రాముల బంగారాన్ని సెట్ రూపంలోనూ, చైన్ రూపంలోనూ నోట్లో అమర్చుకుని దుబాయ్ నుంచి ఢిల్లీకు చేరారు. అంత బంగారాన్ని నోట్లో ఎలా పెట్టుకున్నారనేదే ఆశ్చర్యంగా ఉన్నా..అడ్డంగా మాత్రం దొరికిపోయారు. పంటికి పెట్టుకునే సెట్ రూపంలో పూతపోసి..951 గ్రాముల బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించారనతి కస్టమ్స్ శాఖ తెలిపింది. ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది..స్మగ్లింగ్ ముఠా ప్రమేయముందా లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. మరోవైపు ఇంకో కేసులో మస్కట్ నుంచి వస్తున్న ఓ భారతీయుడిని కూడా కస్టమ్స్ (Customs Department)అధికారులు పట్టుకున్నారు. అతడి దగ్గర్నించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్రౌన్ పేస్ట్ రూపంలో 1801 గ్రాముల బంగారాన్ని జీన్స్ ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకుని వస్తూ పట్టుబడ్డాడు.
Also read: Delhi Corona Update: కరోనా రహితంగా దేశ రాజధాని ఢిల్లీ, సున్నాకు చేరిన మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook