Nellore Mayor Potluri Sravanthi Issue: నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గందరగోళానికి దారితీసింది. సీఎం జగన్ ఫొటో ఏర్పాటుపై మేయర్ స్రవంతి చేసిన వ్యాఖ్యలతో సభ్యుల మధ్య వివాదం మొదలైంది. కార్పొరేషన్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటో ఎవరు ఏర్పాటు చేశారని మేయర్ అనడంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు అందరూ ఆందోళనకు దిగడంతో మేయర్ చెప్పే మాటలు ఏమి వినబడలేదు. తాను చెప్పేది వినాలని మేయర్ అంటున్నా.. కార్పొరేటర్లు మాత్రం నినాదాలతో నిరసన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం మేయర్ స్రవంతి మాట్లాడుతూ.. తనపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే సభలో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. సీఎం జగన్ ఫొటో కౌన్సిల్ హాల్‌లో ఉంటే తనకు కూడా సంతోషమేనని.. ముఖ్యమంత్రి ఫొటో గురించి తానేమి అనలేదన్నారు. కొందరు కార్పొరేటర్లు దురుసుగా వ్యవహరించారని.. బలవంతంగా లాగేశారని అన్నారు. తన చీరను కూడా లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించాలని చూశారని వాపోయారు. కార్పొరేటర్ల తీరుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


కాగా.. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మేయర్ స్రవంతి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాను కూడా కోటంరెడ్డి బాటలోనే నడుస్తానని.. అవసరమైతే కోటంరెడ్డి కోసం తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను కార్పొరేటర్‌గా ఎన్నికయ్యేందుకు కోటంరెడ్డి సహకరించారని.. ఆయన వెంటే తన ప్రయాణమమని స్పష్టంచేశారు. శ్రీధర్ అన్న ఒక్క మాట చెబితే మేయర్ పదవి వదులుకుంటానని చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 


Also Read: YS Sharmila News Updates: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు.. కండీషన్స్ అప్లై


మేయర్ స్రవంతి కూడా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె సీఎం ఫొటోపై కూడా మాట్లాడడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కార్పొరేటర్లలో కొందరు కోటంరెడ్డి వర్గం వారు ఉండగా.. మరికొందరు ఆదాల, అనిల్ కుమార్ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేయర్ తీరుపై కార్పొరేటర్లు నిరసన తెలిపారు. 


Also Read: India Squad for WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ప్రకటన.. ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్లేయర్‌కు పిలుపు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook