ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Jobs 2020) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ పలు పోస్టుల భ‌ర్తీ ప్రక్రియ చేపట్టింది. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌ (National Health Mission) కింద చేపట్టనున్న ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కన్సల్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, పీడియాట్రిషయన్స్, గైనకాలజిస్టులు, బయోమెడికల్ ఇంజినీర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్.. ఇలా మొత్తం 77 పోస్టులను భర్తీ చేస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాచిర్స్ డిగ్రీ (మెడిసిన్‌)/ డెంట‌ల్‌/ న‌ర్సింగ్‌/ బీపీటీ, బ‌యో మెడికల్ ఇంజనీరింగ్‌, మాస్టర్స్ డిగ్రీ (సోష‌ల్ సైన్సెస్‌), పీజీ డిగ్రీ, ఎండీ లలో ఉత్తీర్ణత‌ సాధించడంతో పాటు తగినంత అనుభ‌వం ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు spmuaprect@gmail.com కు మెయిల్ చేయాలి. చివరితేదీ.. అక్టోబర్ 9తో గడువు ముగియనుంది.  Teacher Jobs 2020: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 టీచర్‌ పోస్టులు



అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. వయోపరిమితి విషయానికొస్తే కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లకు మించని అభ్యర్థులు ఈమెయిల్ (spmuaprect@gmail.com) ద్వారా నేషన్ హెల్త్ మిషన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe