NIA RAIDS: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం.. చైతన్య మహిళా సంఘం నేతలే టార్గెట్
NIA RAIDS: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ , హన్మకొండతో పాటు కృష్ణా జిల్లాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
NIA RAIDS: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ , హన్మకొండతో పాటు కృష్ణా జిల్లాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లో చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. వరంగల్ హన్మకొండలోని చైతన్య మహిళా సంఘం నేత అనిత నివాసంలో తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. పలు అంశాల్లో అధికారులు అనితను ప్రశ్నించారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా మైలవరంలోని రాధా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఈ ఏడాది జూన్ లో రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సికింద్రాబాద్ లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. డిజిటల్ పరికరాలతో సహా నేరారోపణలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది.పెద్దబయలు మావోయిస్టు రిక్రూట్‌మెంట్ కేసుకు సంబంధించి హైకోర్టు న్యాయవాది, సీఎంఎస్ సభ్యురాలు చుక్కా శిల్పను అరెస్టు చేశారు. దొంగిల దేవేంద్ర, దుబాసి స్వప్నలను కూడా ఎన్‌ఐఏ అదుపులోనికి తీసుకుంది. నర్సింగ్ విద్యార్థిని రాధ కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలో అదృశ్యమైంది. రాధను చైతన్య మహిళ సంఘం నేతలు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మే 31న కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఎన్‌ఐఏకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.దీంతో కేసును టేకప్ చేసిన ఎన్ఐఏ.. సోదాలు చేసిందియ
జూలై 19, 2022న ఏపీలో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై ప్రకాశం , విజయవాడ, నెల్లూరులో తనిఖీలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కల్యాణ్ రావు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. విజయవాడలో సింగ్ నగర్‌లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ నివాసంలో సోదాలు చేశారు.
Read Also: Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ.. బీజేపీ ఎల్పీ నేత ఎవరో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి