AP govt: నిమ్మగడ్డ వివాదం.. ఎస్ఎల్‌పి నెంబర్ కేటాయించిన సుప్రీం
Nimmagadda Ramesh Kumar అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును రద్దు చేస్తూ గత వారం ఏపీ హై కోర్టు (AP high court ) ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం జూన్ 1న సుప్రీం కోర్టులో ఈ వివాదంపై ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ( SLP petition ) దాఖలు చేయగా.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ కేటాయించింది.
Nimmagadda Ramesh Kumar అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును రద్దు చేస్తూ గత వారం ఏపీ హై కోర్టు (AP high court ) ఇచ్చిన సంచలన తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం జూన్ 1న సుప్రీం కోర్టులో ఈ వివాదంపై ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ ( SLP petition ) దాఖలు చేయగా.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శుక్రవారం స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ కేటాయించింది. దీంతో సుప్రీం కోర్టులో ఈ కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ తొలగింపు చట్టరీత్యా చెల్లుబాటు కాదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పలు అభిప్రాయాలు వెలిబుచ్చింది. ( Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ ఈ లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారు : ఏజీ శ్రీరామ్ )
స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు ప్రక్రియలో డిఫెక్ట్స్ క్లియర్ చేయడానికి ఏపీ సర్కార్ ఐదు రోజులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో ఎస్ఎల్‌పి కేటాయింపులోనూ ఆలస్యం జరిగినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..