ICU Beds: ప్రతి ప్రభుత్వాసుపత్రిలో పది ఐసీయూ బెడ్స్, నిర్మాణ్ సంస్థతో కొత్త కార్యక్రమం
ICU Beds: వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శీకారం చుట్టింది. నిరుపేదలకు సైతం మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
ICU Beds: వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శీకారం చుట్టింది. నిరుపేదలకు సైతం మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
ఏపీలో వైద్య ఆరోగ్యరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా నిరుపేదలకు సైతం నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తీసుకొస్తోంది. దీనికోసం ఓ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో 10 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చేందుకు ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం అమలవుతోంది. ప్రజారోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి..మౌళిక వసతు్ని కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించారు. నిర్మాణ్ సంస్థ ఈ కార్యక్రమానికి చేయూత అందిస్తోంది.
ఈ కార్యక్రమంలో దాతల్ని గుర్తించి..ప్రోత్సహిస్తారు. ప్రతి ఐసీయూ యూనిట్‌పై దాతల పేర్లుంటాయి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూలప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు సిద్ధం కాబోతున్నాయి. తెలంగాణలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.ఇప్పటికి 22 ప్రభుత్వ వైద్యశాలలకు దాతలు ముందుకొచ్చారు.
Also read: Krishnapatnam Police: ఏపీ మాజీ మంత్రి Somireddy Chandramohan Reddyపై కేసు నమోదు చేసిన పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook