Ramagiri Gold Mines: కోలార్ గోల్డ్ మైన్స్. ఇండియాలో ఒకప్పుడు ప్రముఖ బంగారు గని. కర్ణాటకలో ఉంది. అదే సమయంలో ఏపీలో కూడా బంగారు గనుల తవ్వకాలుండేవని ఎంతమందికి తెలుసు. ఇప్పుడు మళ్లీ ఆ గనులు తెరపైకి వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కర్ణాటక ( Karnataka ) రాష్ట్రంలోని కోలార్ ( Kolar Region ) ప్రాంతంలో అపారమైన బంగారు గనులుండేవి. భారత్ గోల్డ్ మైన్స్ ( Bharat Gold Mines ) అనే సంస్థ ఆ తవ్వకాలు నిర్వహించేది. రాను రానూ గని లోతు పెరుగుతూ పోతుండటంతో వ్యయభారం ఎక్కువైపోయింది. మార్కెట్ లో బంగారం ధర ( Gold Price ) తో పోలిస్తే..ఖనిజాన్ని తవ్వి తీసి..ప్రోసెసింగ్ చేసి మార్కెట్ కు తరలించడానికి అయ్యే ఖర్చు ఎక్కువైపోయేది. దాంతో నెమ్మదిగా కోలార్ గోల్డ్ మైన్స్ మూతపడింది. అదే సమయంలో కోలార్ గోల్డ్ మైన్స్ కు అనుబంధంగా ఏపీలో కూడా బంగారు గనులుండేవని వింటే ఆశ్చర్యంగా ఉందా. 


నిజమే..అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని రామగిరి  ( Ramagiri ) మండలంలో ఉన్నాయి. 130 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయివి. కోలార్ గోల్డ్ మైన్స్ ( Kolar gold mines ) లో తవ్వకాలు జరుగుతున్నప్పుడే ఇక్కడ కూడా అదే సంస్థ భారత్ గోల్డ్ మైన్స్ తవ్వకాలు జరిపేది. అప్పట్లో మార్కెట్ లో బంగారం ధర తక్కువగా ఉండటంతో..వ్యయభారం ఎక్కువై పనులు నిలిపేశారు. ఇప్పుడు మరోసారి రామగిరి బంగారు గనులు తెరపైకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలోని చిగురుగుంటలో బంగారు గనుల తవ్వకాల్ని ఇటీవల ఎన్ఎండీసీ ( NMDC ) సంస్థ చేజిక్కించుకుంది. ఇప్పుడు అదే సంస్థ రామగిరి బంగారు గనులపై దృష్టి పెట్టింది. రామగిరి బంగారు గనుల్లో నిక్షేపాలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.  40 ఏళ్లు నడిచిన రామగిరి గోల్డ్ మైన్స్..2001లో మూతపడింది. 


బంగారు ఖనిజాన్ని తవ్వితీస్తే గిట్టుబాటవుతుందా లేదా వంటి అంశాల్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర గనుల శాఖ ( Ap mines Department ) కు ఎన్ఎండీసీ ప్రతిపాదన చేసింది. వందల అడుగుల లోతున ఉన్న ఈ గనుల నుంచి తవ్వితీసే మట్టిలో టన్నుకు 2-3 గ్రాముల బంగారముంటుందని అంచనా. ఇది లాభదాయకమా కాదా అనేది పరిశీలించాల్సి ఉంది. బంగారమైతే రామగిరి గనుల్లో ఉందనేది వాస్తవం. కానీ ఎంతమేర ఉండవచ్చు..ఎంత లోతున వెళ్లాల్సి ఉంటుంది..ఖర్చు ఎంతవుతుందనేది లెక్కగట్టడానికే ఎన్ఎండీసీ అధ్యయనం చేస్తానంటోంది. 


Also read: AP: ఐపీసీ, సీఆర్‌పీసీల్లో సవరణ తీసుకురండి, ప్రధానిని కోరిన విజయసాయి రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook