NO Confidence Motion: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కార్పొరేషన్‌లో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. తెలుగుదేశం అసమ్మతి వర్గం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిచింది. మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులు పదవీచ్యుతులయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాకినాడ కార్పొరేషన్(Kakinada Corporation) గత కొద్దికాలంగా ఉత్కంఠ రేపుతూ ఇవాళ్టికి ముగిసింది. కాకినాడ కార్పొరేషన్‌లో మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ 1 గా ఉన్న సత్తిబాబులపై సొంతపార్టీలోనే అసమ్మతి రేగింది. టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పుడు..కాకినాడ పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తీసుకున్న నిర్ణయం కార్పొరేటర్లలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్‌ని నిర్లక్ష్యం చేస్తూ..కేవలం మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి విప్ జారీ చేయడం వివాదానికి కారణమైంది. ఈ క్రమంలో అసమ్మతి గళం మరింత బలోపేతమైంది. 


ఇవాళ కాకినాడ మేయర్ సుంకర పావని(Sunkara Pavani), డిప్యూటీ మేయర్ 1 గా ఉన్న సత్తిబాబులపై తెలుగుదేశం పార్టీకు చెందిన అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం(No Confidence Motion)ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, మూడు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ కౌన్సిల్‌లో మొత్తం 44 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కావల్సిన కోరం 31 అయితే ముగ్గురు ఎక్స్ అఫీషియోతో కలిపి 46 మంది హాజరయ్యారు. దాంతో అవిశ్వాస తీర్మానం సజావుగా సాగింది. మంత్రి కురసాల కన్నబాబు(Kannababu), సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీత(Vanga Githa)అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. కోర్టు కేసు నేపధ్యంలో ఫలితాల్ని ప్రిసైడింగ్ అధికారులు రిజర్వ్ చేశారు. కోర్టు తీర్పు అనంతరం ఫలితాల్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఫలితాల్ని అధికారికంగా ప్రకటించిన తరువాత కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. 


Also read: Fuel Prices Hike: మరోసారి పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు, సెంచరీకు చేరుకున్న డీజిల్ ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook