విజయవాడ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సందర్భంగా మార్చి 11 వరకు నామినేషన్స్ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేడు మార్చి 12న నామినేషన్స్ పరిశీలన జరగనుండగా.. మార్చి 14వ తేదీ నామినేషన్స్ ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. ఈ నేపథ్యంలో 13 జిల్లాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల వివరాలను తాజాగా ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 652 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకుగాను 4,778 అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. మార్చి 9, 10 తేదీల్లో నామమాత్రపు నామినేషన్స్ మాత్రమే దాఖలైనప్పటికీ.. బుధవారం ఒక్కరోజే 4,355 నామినేషన్స్ దాఖలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : AP govt holidays: ఆ 2 రోజులు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్


జిల్లాల వారీగా ఏయే జిల్లాలో ఎన్ని నామినేషన్స్ దాఖలయ్యాయో తెలిపే వివరాలు:
1) శ్రీకాకుళం జిల్లాలో 38 స్థానాలకుగాను 281 నామినేషన్స్ దాఖలు కాగా అందులో 9వ తేదీన 1, 10వ తేదీన 22, 11వ తేదీన 258 నామినేషన్స్ ఉన్నాయి.
2) విజయనగరం జిల్లాలో 34 స్థానాలకు గాను 241 నామినేషన్స్ దాఖలు కాగా అందులో 9వ తేదీ 2, 10వ తేదీన 33, 11వ తేదీన 206 దాఖలయ్యాయి.
3) విశాఖపట్నం జిల్లాలో 39కు గాను 296 నామినేషన్స్ దాఖలయ్యాయి. అందులో 9వ తేదీన 3, 10వ తేదీన 26, 11వ తేదీన 296 దాఖలయ్యాయి.
4) తూర్పుగోదావరి జిల్లాలో 61 స్థానాలకుగాను 482 నామినేషన్స్ వచ్చాయి. ఇందులో 9వ తేదీన 2, 10వ తేదీన 51 నామినేషన్స్ దాఖలు కాగా 11వ తేదీన 429 దాఖలయ్యాయి.
5) పశ్చిమగోదావరి జిల్లాలో 48కుగాను 370 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఇందులో 9వ తేదీన 6, 10వ తేదీన 35, 11న 329 నామినేషన్స్ దాఖలయ్యాయి.
6) కృష్ణా జిల్లాలో 46 కుగాను 331 నామినేషన్స్ దాఖలు కాగా అందులో 9న 2, 10న 26, 11న 303 దాఖలయ్యాయి. 
7) గుంటూరు జిల్లాలో 54కుగాను 388 నామినేషన్స్ ధాఖలు కాగా 9వ తేదీన 2, 10వ తేదీన 24, 11వ తేదీన 362 నామినేషన్స్ దాఖలయ్యాయి.
8) ప్రకాశం జిల్లాలో 55 నామినేషన్స్‌కి గాను మొత్తం 394 నామినేషన్స్ దాఖలు కాగా.. 9వ తేదీన 6, 10న 14, 11వ తేదీన 374 నామినేషన్స్ దాఖలయ్యాయి.
9) ఎస్పీ నెల్లూరు జిల్లాలో (46) కుగాను 330 (9వ తేదీ 7, 10వ తేదీ 15, 11వ తేదీ 308  )
10) కర్నూలు జిల్లాలో 53 స్థానాలకుగాను 351 నామినేషన్స్ దాఖలవగా.. అందులో 9 నాడు ఒక్క నామినేషన్ కూడా దాఖలవలేదు. రెండో రోజైన 10వ తేదీన 20, 11వతేదీన 330 మంది నామినేషన్స్ దాఖలు చేశారు. 
11) అనంతపురం జిల్లాలో 63 స్థానాలకుగాను 474 మంది నామినేషన్లు వేయగా 9 నాడు 9 మంది, 10వ తేదీన 27 మంది, 11వ తేదీన 438 నామినేషన్స్ దాఖలు చేశారు.
12) చిత్తూరు జిల్లాలో 65 కుగాను 480 మంది నామినేషన్స్ దాఖలు చేయగా అందులో 9వ తేదీన 22 మంది, 10వ తేదీన 37 మంది, 11వ తేదీన 421 మంది నామినేషన్స్ దాఖలు చేశారు.  
13) వైఎస్ఆర్ కడప జిల్లాలో 50 స్థానాలకుగాను 341 మంది నామినేషన్స్ దాఖలు చేయగా.. అందులో 9వ తేదీన ఆరుగురు, 10వ తేదీన 35 మంది, 11వ తేదీన 300 మంది నామినేషన్స్ దాఖలు చేశారు.


Read also : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే


మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. ఆలోగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కానీ లేదా ఇతర కారణాలతో కానీ కొంత మంది అభ్యర్థులు తమ నామినేషన్స్ ఉపసంహరించుకునే వీలుంది. ఆ తర్వాత మార్చి 21న పోలింగ్ జరగనుండగా.. మార్చి 24న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..