Urdu Language: ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ఉర్దూను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. రెండవ అధికారిక భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రవేశపెట్టిన అధికార భాషల చట్ట సవరణ 2022కు ఆమోదం లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముస్లింల మాతృభాష ఉర్దూకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉర్దూను రాష్ట్ర రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఉర్దూను రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ 2022 బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష ఈ బిల్లును ప్రతిపాదించగా..అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతోపాటు రాష్ట్రంలో మైనార్టీల భద్రత, సామాజిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఏపీ మైనార్టీస్ కాంపొనెంట్ మరియు ఆర్ధిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం 2022కు అసెంబ్లీ ఆమోదించింది. 


ఉర్దూ అనేది ఓ మతానికి సంబంధించింది కాదని..నిఖార్సైన భారతీయ భాష అని డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాష తెలిపారు. ఉర్దూకు తెలుగుతో సమానహోదా కల్పించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండవ అధికారక భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూను రెండవ అధికారిక భాషగా గుర్తించింది. ఇప్పుడు ఏపీలో అదే గౌరవం లభించింది. అధికారిక భాషగా గుర్తించడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా కొనసాగనున్నాయి. 


ఏ జిల్లాలో ఎంత శాతం


రాష్ట్రంలో ఉర్దూ మాట్లాడే ప్రజలు కడపలో 19 శాతం, గుంటూరులో 15.55 శాతం, చిత్తూరులో 13.16 శాతం, అనంతపురంలో 12.91 శాతం, కర్నూలులో 11.55 శాతం, కృష్ణాలో 8.42 శాతం, నెల్లూరులో 7.84 శాతం, ప్రకాశంలో 5.65 శాతం ఉన్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో దాదాపు 2 శాతం ఉన్నారు. ఉర్దూని రెండవ అధికారిక భాషగా గుర్తించడంతో ఉర్దూ ప్రేమికులు ఆనందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. 


Also read: AP EAPCET Schedule: ఏపీ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook