Ntr Health University Issue: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం అటు తిరిగీ..ఇటు తిరిగీ తెలుగుదేశం పార్టీకే చేటు తెచ్చేట్టు కన్పిస్తోంది. నందమూరి కుటుంబంలో చిచ్చు రేపింది. టీడీపీలో అంతర్గత కలహం పెరిగి పెద్దదౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాయి. అటు వైసీపీ నేతలు కూడా దీటుగా సమాధానాలిస్తున్నారు. నాటి వైశ్రాయ్ ఘటనను గుర్తు చేస్తూ..ప్రశ్నిస్తున్నారు. మహనీయుడైన ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ విమర్శలు ఎక్కుపెడుతుంటే..నాడు వైశ్రాయి ఘటనలో ఎన్టీఆర్ పై చెప్పులు విసిరినప్పుడు ఆయన గౌరవం ఏమైందని..అప్పుడాయన్ని అవమానపర్చినప్పుడు తెలియలేదా అని ఎదురుదాడికి దిగుతున్నారు. 


సోషల్ మీడియాలో వార్


మరోవైపు ఎన్టీఆర్ కుటుంబం స్పందన కొత్త చిచ్చు రాజేస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల్లో అసంతృప్తి కల్గిస్తోంది. తారక్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే వార్ జరుగుతోంది. ఎన్టీఆర్ పేరు పెట్టుకుని..ఆయన పేరు వాడుకుని ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్..గట్టిగా స్పందించకపోవడం, వైఎస్ఆర్ గురించి సానుకూలంగా మాట్లాడటంపై జూనియర్ ఎన్టీఆర్‌పై దాడి తీవ్రం చేశారు టీడీపీ అభిమానులు. అటు జూనియర్ అభిమానులు కూడా ఈ ట్రోలింగ్‌ను  గట్టిగానే తిప్పికొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను గతంలో పార్టీ కోసం వాడుకుని...తరువాత పక్కన పడేసి పార్టీకి అతడి అవసరం లేదని చెప్పినవారికి ..అతనెలా స్పందిస్తే ఏంటని ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయంగా, సినిమాపరంగా తొక్కేసేందుకు ప్రయత్నిస్తూ..ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడి స్పందనపై ఎందుకింత తీవ్రంగా వాదిస్తున్నారని జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు. 


మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో, నందమూరి కుటుంబంలో కొత్త చిచ్చు రాజేసింది. జూనియర్ ఎన్టీఆర్ గతం, పుట్టుక గురించి కూడా దారుణంగా మాట్లాడుతూ..విమర్శలు చేస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో వైఎస్ జగన్ రేపిన చిచ్చు..వైసీపీను కాకుండా టీడీపీ, ఎన్టీఆర్ కుటుంబంలోనే అంతర్గత విబేధాలకు దారి తీస్తోంది.


Also read: Chandrababu: జగన్ స్కెచ్‌లో బాబు పడింది నిజమే, ఎన్టీఆర్ అవసరం లేదంటూ చంద్రబాబు ఇంటర్వ్యూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook