Ram Gopal varma bail petition in ap highcourt: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు భయపడి కన్పించకుండా పోయారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రాహ్మణిలపై వివాదాస్పద పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల దీనిపై ఒంగోలులో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒంగోలు పోలీసులు హైదరబాద్ వర్మా నివాసానికి వచ్చి మరీ నోటీసులు ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 19 ఆయన హజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హజరు కాకుండు.. లాయర్ తో రిక్వెస్ట్ లేటర్ పంపించారు. తనకు నాలుగు రోజుల టైమ్ కావాలన్నారు. అదే విధంగా మరల ఏపీ పోలీసులు హైదరబాద్ కు చేరుకున్నారు. ఆర్జీవి ఇంటి వద్ద నిన్న హైటెన్షన్ నెలకొందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం వర్మా.. షాద్ నగర్ లోని ఒక ప్రముఖ హీరోకు చెందిన ఫామ్ హౌస్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కోయంబత్తూరులో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది.


ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని బృందాలను హైదరబాద్ లో.. కొంత మంది కోయంబత్తూరుకు పంపించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో డైరెక్టర్ మాత్రం.. దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తొంది.. అయితే.. ఈరోజు ఏపీ హైకోర్టులో వర్మకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్ లు విచారణకు రానుందని తెలుస్తొంది. ప్రకాశం జిల్లా, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనమీద నమోదైన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.


Read more: Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..


గతంలో బెయిల్ పిటిషన్ ల విచారణ వాయిదా వేసిన కోర్టు.. అన్ని పిటిషన్లను ఒకేసారి కోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో ఆర్జీవీకి రిలాక్సెషన్ దొరుకుతుందా.. లేదా అన్న దానిపై మరోసారి సర్వత్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకొవచ్చు. మరోవైపు ఆర్జీవీ తరపు లాయర్ తాము.. ఆన్ లైన్ లో విచారణకు సిద్దంగా ఉన్నామని.. రిక్వెస్ట్ లెటర్ పంపించిన కూడా.. పోలీసులు ఇంటి దగ్గర రావడం ఏంటని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తొంది.  మరోవైపు ఆర్జీవి మాత్రం.. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని కూడా తెగ భయపడిపోతున్నారంట. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.